దోపిడీకిపోయి దొరికిపోయారు..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:52 AM
చిత్తూరు జిల్లా కేంద్రంలో ఓ దొంగల మూఠా బుధవారం హల్ చేసింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం రేగింది. సదరు ముఠాలోని కీలక నేరస్థుడు సుబ్రహ్మణ్యం అలియాస్ మాణ్యాలు నంద్యాల జిల్లా కేంద్రానికి చెందిన వాడు. ఇతనితోపాటు నంద్యాలకు చెందిన నవీన్ అనే మరో దొంగ కూడా పోలీసులకు పట్టుబట్టాడు.

చిత్తూరు ఘటనలో నంద్యాల జిల్లా నేరస్థులు
నంద్యాల, మార్చి 12 ( ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కేంద్రంలో ఓ దొంగల మూఠా బుధవారం హల్ చేసింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం రేగింది. సదరు ముఠాలోని కీలక నేరస్థుడు సుబ్రహ్మణ్యం అలియాస్ మాణ్యాలు నంద్యాల జిల్లా కేంద్రానికి చెందిన వాడు. ఇతనితోపాటు నంద్యాలకు చెందిన నవీన్ అనే మరో దొంగ కూడా పోలీసులకు పట్టుబట్టాడు.
ఫర్నీచర్ షాపు పేరుతో రూ.కోట్లలో అప్పులు
నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ ఫర్నీచర్ దుకాణం పెట్టాడు. కంతుల వారీగా ఫర్నీచర్ వ్యాపారానికి తెరలేపాడు. ఈ క్రమంలో పెద్దఎత్తున ఖాతాదా రులు నగదు చెల్లించారు. సదరు నగదుతో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసి సొమ్ము చేసుకు న్నారని సమాచారం. ఆయితే ఏం జరిగిందో.. ఏమో కానీ.. ఆ తర్వాత.. రూ. కోట్లలో ఐపీ పెట్టి 2013 తర్వాత ఇక్కడి నుంచి చిత్తూరుకు మాకాం మార్చా రని తెలిసింది. అక్కడ కూడా ఇదే తరహాలో పలు రకాలు వ్యాపారులు చేసి రూ.కోట్లలో అప్పులు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దొంగత నాలకు తె
కీలక నేరస్థుడిపై 2005 లోనే హత్య కేసు
సదరు ముఠా లోని కీలక నేరస్థుడు సుబ్రహ్మ ణ్యంది నంద్యాల జిల్లా కేంద్రం లోని ఓ కాలనీ. అయితే ఇదే కాలనీలోని ఓ రాజకీయ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. సదరు నేరస్థుడికి ఆ నాయకుడు అండగా ఉండేవాడు. అయితే తనకు ఎదురే లేకుండా ఉండాలని సదరు నాయకుడిని కూడా అంతమొందించాడు. కర్నూలు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన నేరచరిత్ర కలిగిన ముఠాకు సుఫారి ఇచ్చి హత్య చేయించాడు. 2005లో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీంతో అప్పట్లో సదరు నేరస్థుడిపై హత్య కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి ఆ నేరస్థుడంటే నగరంలో అందరికీ భయం అనే చర్చ కొనసాగింది. ఇదే భయాన్ని ఆసరాగా చేసుకొని ఆ నేరస్థుడు వ్యాపారాల్లో దిగాడు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
ఉదయం నుంచి చిత్తూరు దొంగల ముఠా కలకలం రేగడంతో జిల్లాల పోలీసులు సదరు ముఠా దొంగల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడి పోలీసులు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారయ్యారు. పరారైన వారిలో ఒకరు నంద్యాల జిల్లా కేంద్రంలోని తన సమీప బంధువైన ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఈ నేపథ్యంలో పసిగట్టిన పోలీసులు ఫోన్ చేసిన నేరస్థుడితో పాటు.. ఆటోడ్రైవర్ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
వ్యాపార సమయంలో పరిచయం..
చిత్తూరులో దొంగతనం చేయడానికి వెళ్లిన యజమానితో సదరు నేరస్థుడికి పలు వ్యాపార సమయాల్లో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. సదరు కిడ్డీ షాపు యజమాని కదలికలపై రెక్కి నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో ఇరువురి మధ్య ఏమైనా వ్యాపార లావాదేవీల్లో తేడాలు ఉన్నాయా అన్న అనుమానాలు లేకపోలేదు.