Share News

గాలి వాన బీభత్సం

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:23 AM

గాలీవాన బీభత్సానికి అరటి చెట్లు నేలపాలు కాగా, మామిడికాయలు నేల రాలాయి.

గాలి వాన బీభత్సం
భారీ వర్షానికి నేలవాలిన అరటి చెట్లు

నేలరాలిన అరటి, మామిడి కాయలు

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): గాలీవాన బీభత్సానికి అరటి చెట్లు నేలపాలు కాగా, మామిడికాయలు నేల రాలాయి. సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సంతో రైతులకు తీవ్ర నష్టం సంభవిం చింది. ప్రతి ఏటా ఇదే నెలలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా చేతికొచ్చినటట అరటి, మామిడి పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మం డలంలోని కాల్వ, హుశేనాపురం, కాల్వబుగ్గ గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే.. కాల్వ గ్రామంలో విద్యుత స్థంభం నేలకొర గడంతో విద్యుత లేక ప్రజలు దోమల బెడదతో అల్లాడిపోయారు. మామిడి, అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:23 AM