రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:55 AM
జిల్లాలోని రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంతో జిల్లాలోని రోడ్లు అన్నీ గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు చెందిన శాసన సభ్యులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, అభివృద్ధి చేయాల్సిన రహదారుల జాబితాలతోప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. రూ.37.85 కోట్ల అంచనాలతో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలోని రహదారుల అభివృద్ధి, వాటికి కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.

- జిల్లా ర హదారుల అభివృద్ధికి రూ.15.35 కోట్లు
- స్టేట్‌హైవేల అభివృద్ధికి మరో రూ.22.50కోట్లు
- శాసన సభ్యుల ద్వారా పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం
- త్వరలో టెండర్‌లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
జిల్లాలోని రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంతో జిల్లాలోని రోడ్లు అన్నీ గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు చెందిన శాసన సభ్యులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, అభివృద్ధి చేయాల్సిన రహదారుల జాబితాలతోప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. రూ.37.85 కోట్ల అంచనాలతో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలోని రహదారుల అభివృద్ధి, వాటికి కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
- గన్నవరం నియోజకవర్గంలోని నున్న బైపాస్ రోడ్ 0 కిలోమీటరు నుంచి 5.660 కిలోమీటరు వరకు జాతీయ రహదారి లింక్ రోడ్డు కనెక్షన్‌తోపాటు రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, కట్టుబండిపాలెం వరకు ఉన్న రహదారిని 3.70కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ. 2.65 కోట్లతో అంచనాలు రూపొందించారు.
- పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలోని పోడు గ్రామం నుంచి చినగొల్లపాలెం గ్రామం వరకు 14 కిలోమీటర్ల మేర ఉన్న రహదారిని పోడు గ్రామం నుంచి 6వ కిలోమీటరు వరకు, 8వ కిలోమీటరు నుంచి 14వ కిలోమీటరు వరకు మొత్తంగా 12కిలోమీటర్ల మేర అభివృద్ధి, మరమ్మతులు చేసేందుకు రూ. 4.2 కోట్లతో అంచనాలు రూపొందించారు.
- బంటుమిల్లి మండలం కొమాళ్లపూడి రహదారిని 0 కిలోమీటరు నుంచి 3వ కిలోమీటరు వరకు, 6వ కిలోమీటరు నుంచి 11వ కిలోమీటరు వరకు మొత్తంగా 8 కిలోమీటర్ల మేర అభివృద్ధి, మరమ్మతులు చేసేందుకు రూ.2.50కోట్లతో అంచనాలు రూపొందించారు.
- పెనమలూరు నియోజకవర్గలోని ఉప్పులూరు-మద్దూరు రహదారిని 0 కిలోమీటరు నుంచి 4.200వ కిలోమీటరు వరకు, 4.650వ కిలో మీటరు నుంచి 10.825వ కిలోమీటరు వరకు 10.375 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించారు.
స్టేట్ హైవేస్ విభాగంలో..
పామర్రు నియోజకవర్గంలోని గుడివాడ-చల్లపల్లి-కొత్తపాలెం రహదారి 20వ కిలోమీటరు నుంచి 21.500వ కిలోమీటరు వరకు, 22.600వ కిలోమీటరు నుంచి, 26వ కిలోమీటరు వరకు, 29వ కిలోమీటరు నుంచి 30వ కిలోమీటరు వరకు మొత్తంగా 5.90 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించారు.
- గుడివాడ నియోజకవర్గంలోని ముదినేపల్లి-గుడ్లవల్లేరు మండలాలను కలిపే రహదారి 5వ కిలోమీటరు నుంచి 7వ కిలోమీటరు వరకు, 9.800వ కిలోమీటరు నుంచి 11.840వ కిలోమీటరు వరకు మొత్తంగా 3.64 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేసేందుకు రూ.2.50కోట్లతో అంచనాలు రూపొందించారు.
- గుడివాడ పట్టణంలోని బైపాస్ రహదారిని 0 కిలోమీటరు నుంచి 3.66 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.2.50కోట్లతో అంచనాలు రూపొందించారు.
- మచిలీపట్నం నియోజకవర్గంలోని కమ్మవారిచెరువు రహదారిని 12వ కిలోమీటరు నుంచి 15.700 కిలోమీటరు వరకు 3.70 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.1.50కోట్లతో అంచనాలు రూపొందించారు.
- అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలోని రామానగరం నుంచి నడకుదురు వరకు 10.80 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేసేందుకు రూ.5కోట్ల అంచనాలు రూపొందించారు.
- పెడన నియోజకవర్గం సింగరాయపాలెం-బంటుమిల్లి రహదారి 7వ కిలోమీటరు నుంచి 15.800వ కిలోమీటరు వరకు మొత్తంగా 8.80 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.4కోట్లతో అంచనాలు రూపొందించారు.