డీఈవో కార్యాలయంలో ప్రక్షాళన
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:20 AM
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రక్షాళనకు డీఈవో కిరణ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం తగ్గించి ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పలువురికి స్థానచలనం కల్పించారు.

పలువురు ఉద్యోగులకు స్థానచలనం
ఒంగోలు విద్య, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రక్షాళనకు డీఈవో కిరణ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం తగ్గించి ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పలువురికి స్థానచలనం కల్పించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏ సెక్షన్‌లో ఏ-2గా షేక్ అల్లావలి, ఏ-3గా రమణయ్య, ఏ-4గా సిహెచ్.నవ్య, ఏ-7గా పి.స్టీవెన్‌సన్, బీసెక్షన్‌లో బీ-2గా కేవీ నాగార్జునరెడ్డి, బీ-4గా షేక్ మదార్‌బీ, బీ-5గా మల్లికార్జునరావును నియమించారు. సీసెక్షన్‌లో సీ-5గా నవ్యరోహిణి, సీ-6గా బి.శాంతికుమార్, అవుట్ వర్క్‌లో బి.బాలగురవయ్య, బి.సుబ్బారాయుడును నియమించారు. వీరంతా పాత స్థానాల్లో పూర్తి చార్జిని అప్పగించి వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో డీఈవో ఆదేశించారు.