24న పీఎం కిసాన్ నిధులు విడుదల
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:15 AM
రైతులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని ఈనెల 24వతేదీన రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి మూడు విడతలుగా ఒక్కో దఫా రూ.2వేలను జమ చేస్తోంది.

జిల్లాలో 2.48 లక్షల మంది రైతులకు రూ.49.51 కోట్లు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని ఈనెల 24వతేదీన రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి మూడు విడతలుగా ఒక్కో దఫా రూ.2వేలను జమ చేస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 19 విడతలుగా నగదును ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో విడత నగదు జమను ఈనెల 24న చేయనుంది. జిల్లాలో 2.48లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అందుకు సంబంధించి ఒక్కో రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున జిల్లాకు రూ.49.51 కోట్లు జమ కానున్నాయి.