రొయ్యసాగు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:50 AM
రొయ్యలు సాగు చేసే రైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని, యూనిట్ విద్యుత్ రూపాయన్నరకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరం త్రోవగుంట కంపెనీల వద్ద గల బృందావన్ కల్యాణ మండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య సాగు రైతుల నూతన కమిటీ ఏర్పాటుకు,సమస్యలపై చర్చకు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రొయ్య విత్తనం (సీడ్)మంచి నాణ్యతది సరఫరాలేక పోవటంతో పంట దిగుబడి సక్రమంగా రావటంలేదన్నారు.

ఒంగోలు(రూరల్)ఏప్రిల్14(ఆంధ్రజ్యోతి): రొయ్యలు సాగు చేసే రైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని, యూనిట్ విద్యుత్ రూపాయన్నరకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరం త్రోవగుంట కంపెనీల వద్ద గల బృందావన్ కల్యాణ మండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య సాగు రైతుల నూతన కమిటీ ఏర్పాటుకు,సమస్యలపై చర్చకు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రొయ్య విత్తనం (సీడ్)మంచి నాణ్యతది సరఫరాలేక పోవటంతో పంట దిగుబడి సక్రమంగా రావటంలేదన్నారు. అడ్డగోలు విద్యుత్ బిల్లులు రావడంతో అవి కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ యూనిట్ ఒకటిన్నర రూపాయికి ఇవ్వాలన్నారు. అడిగిన ప్రతిరైతుకు కొర్రీలు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుతో పాటు తక్షణమే అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘాన్ని ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఈదర యస్వంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిలారి రవికుమార్, కోశాధికారిగా ఏడుగుండ్ల కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షుడిగా చెరుకూరి లక్ష్మీనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.