ఆ దుండగులెవరు?
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:53 AM
మండలంలోని అంకేపల్లిలో పనిచేస్తున్న సచి వాలయ ఉద్యోగిపై గత బుధవారం జరిగిన దాడికేసు పోలీసులకు సవాలుగా మారింది.

సచివాలయ ఉద్యోగిపై దాడితో ఉలికిపాటు
పోలీసులకు సవాల్‌గా మారిన కేసు
మర్రిపూడి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అంకేపల్లిలో పనిచేస్తున్న సచి వాలయ ఉద్యోగిపై గత బుధవారం జరిగిన దాడికేసు పోలీసులకు సవాలుగా మారింది. గతంలో ఎన్నడు లేని విధంగా బైక్‌పై విధుల కు హాజరౌతున్న వ్యవసాయ సహాయకులు చి నబాబుపై మాస్క్‌లు ధరించి వచ్చిన ముగ్గరు యువకులు దాడికి పాల్పడటం మండలంలో భయాందోళనలు రేకెత్తించింది. కూచిపూడికి చెందిన ఈర్ల చినబాబు బైక్‌పై విధినిర్వహ ణకు అంకేపల్లికి వస్తుండగా గంగమ్మ దేవాల యం సమీపంలోకి వచ్చే సరికి వెనుకవైపు నుంచి ముగ్గురు దుండగులు బైక్‌పై వెంబ డించారు. హలోబ్రో అని పలకరించడంతో ప క్కకు తిరిగి చూసిన చినబాబుపై మధ్యలో కూర్చున్న వ్యక్తి కళ్లల్లో పెప్పర్‌స్రే చేశారు. దీంతో అదుపు తప్పి మోటార్‌సైకిల్‌పై నుంచి కింద పడ్డాడు. వెనుక కూర్చున్న వ్యక్తితోపాటు మిగి లిన ఇద్దరు ఇనుప రాడ్లతో విచక్షణారహి తంగా దాడి చేశారు. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ హారన్ వినపడటంతో ముగ్గురు దుండగులు పరార య్యారు. తీవ్రంగా గాయపడిన చినబాబును స్వగ్రామమైన కూచిపూడికి మోటార్‌సైకిల్‌పై తరలించారు. అక్కడ నుంచి ఒంగోలు రిమ్స్ లో చేర్పించారు. మెరుగైన చికిత్సకోసం గుం టూరులో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. మండలంలోని పలుగ్రామాలలో సీసీకెమేరాలు ఏర్పాటు చేశారు. దుండగులు ప్రయాణించే ద్విచక్రవాహనం ఏ గ్రామంలోనైనా సీసీ కెమె రాల్లో నిక్షిప్తమై ఉంటుంది. దుండగులు మర్రి పూడి మండల నుంచి కనిగిరి, పొదిలి, కొం డపి, చీమకుర్తి, జరుగుమల్లి మండలాల వైపు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆయా మండలాల్లోని పలు గ్రామాలు మర్రిపూడి మండలానికి అనుసంధానమై ఉన్నాయి. అక్క డ కూడా సీసీకెమెరాలను పరిశీలిస్తే దుండ గుల వాహన కదలికలు తెలుసుకునే అవకా శం ఉందని చెబుతున్నారు. మరోవైపు పోలీసు లు సైతం ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానం స హాయంతో ఛేదించాలని భావిస్తున్నారు. దాడి చేసిన సమయంలో ఆ ప్రదేశంలో సెల్‌ఫోన్ టవర్ల ఆధారంగా దుండగుల ఫోన్‌లను గు ర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడికి గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. గతం లో చినబాబుతో ఎవరికైనా విబేధాలు ఉన్నా యా లేక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే నేప థ్యంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దుండగులు మాస్క్‌లు ధరించ డంతో ఆ ముగ్గురు క్షతగాత్రుడికి ముఖపరిచ యం ఉన్నవారై ఉంటాయని భావిస్తున్నారు. మొత్తంగా ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.