Share News

వాడవాడలా అంబేడ్కర్‌ జయంతి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:51 PM

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని సోమవారం జిల్లాలోని వాడ వాడలా ఘనంగా నిర్వహించారు.

వాడవాడలా అంబేడ్కర్‌ జయంతి
ఆమదాలవలస: అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని సోమవారం జిల్లాలోని వాడ వాడలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్సీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొని నివాళి అర్పించారు. ఎమ్మెల్యేలు అంబేడ్కర్‌ సేవలను కొనియాడారు.
నిమ్నజాతుల అభ్యున్నతికి అంబేడ్కర్‌ కృషి: బగ్గు
నరసన్నపేట/పోలాకి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి):
నిమ్నజాతుల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డా. బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా నరసన్నపేట, పోలాకిల్లో ఆయన విగ్రహానికి పూలమావేసి నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో విశేష భూమిక పోషించిన అంబేడ్కర్‌ చిరస్మరణీయుడని కీర్తించారు. కార్యక్రమంలో ఎస్టీ, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉప్పాడ కేశవరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెవర రాము, జయరాజ్‌, మోహన్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడవాలి: శిరీష
పలాస/కాశీబుగ్గ, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి):
డాక్టర్‌ అంబేడ్కర్‌ అడుగు జాడల్లో యువత నడిచి ఆయన ఆశయసాధనకు పాటుపడాలని ఎమ్మె ల్యే గౌతు శిరీష అన్నారు. మొగిలిపాడు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. అలాగే కాశీబుగ్గ బస్టాండ్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌ పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, ఎం.నరేంద్ర, బర్ల కృష్ణారావు, బుడత జగదీష్‌ పాల్గొన్నారు.
అంబేడ్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం కావాలి: ఎంజీఆర్‌
పాతపట్నం/హిరమండలం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం కావాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పాతపట్నం కోర్టు కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ రచయితగా ఆయనచేసిన సేవలు చిరస్మరణీయ మన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ యువజనసంఘం ప్రతినిధులు, టీడీ పీ నాయకులు పాల్గొన్నారు. హిరమండలం మండలం తంప, ధనుపురం గ్రామాల్లో అంబే డ్కర్‌ విగ్ర హాలను ఎమ్మెల్యే ఆవిష్కరిం చారు. పాతపట్నం మండలం చంగుడి గ్రామంలో అంబే డ్కర్‌ విగ్రహాన్ని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రుంకు అప్పారావు ఆవిష్క రించారు. కార్యక్ర మంలో సంఘాల నేతలు పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తితో పాలన: రవికుమార్‌
ఆమదాలవలస, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):
అంబేడ్కర్‌ మార్గం అను సరణీయమని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నా రు. సోమవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా.. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శనీయుడు అంబేడ్కర్‌: ఎన్‌ఈఆర్‌
రణస్థలం/లావేరు/ జి.సిగడాం, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి):
డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ ఆదర్శనీయుడని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం జేఆర్‌ పురం, రణస్థలం, జి.సిగడాం, లావేరుల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాయల రమణ, ముప్పిడి సురేష్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ తోటయ్యదొర, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:51 PM