Share News

అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:12 AM

భారత రాజ్యాంగ వాస్తు శిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నా రు.

అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

జి.సిగడాం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యో తి): భారత రాజ్యాంగ వాస్తు శిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నా రు. శనివారం పాలఖ డ్యాం కూడలి వద్ద గ్రామానికి చెందిన కొర్నాన సీతారాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమం లో నాయకులు కుమరాపు రవికుమార్‌, బాలబొమ్మ వెంకటే శ్వరరావు, పలిశెట్టి సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:12 AM