Share News

ఆలయాల దర్శనానికి సైకిల్‌ యాత్ర

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:18 AM

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వయస్సు గల యువకుడు సాయి శివరామకృష్ణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల సంద ర్శనకు సైకిల్‌ యా త్ర చేపట్టాడు.

ఆలయాల దర్శనానికి సైకిల్‌ యాత్ర
లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద సాయి శివరామకృష్ణ

గార, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వయస్సు గల యువకుడు సాయి శివరామకృష్ణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల సంద ర్శనకు సైకిల్‌ యా త్ర చేపట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బూరవల్లి గ్రామానికి చేరుకుని ప్రసిద్ధ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని దర్శించి, ఆలయ చరిత్రను అర్చకులు ఆర వెల్లి సీతారామస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివరా మకృష్ణ మాట్లాడుతూ.. డిప్లమో చదివిన తాను రాష్ట్రంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శిస్తూ, వాటి ప్రత్యేకతలు తెలు సుకునేందుకు గత నెల 26న తన స్వగ్రామం నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించినట్టు చెప్పారు. ఇంత వరకు కోనసీమ, కాకినాడ, అన కాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి ప్రసి ద్ధ ఆలయాలను దర్శించుకున్నట్టు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోని దేవాలయాలను దర్శించనున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 12:18 AM