Share News

తీరప్రాంత రక్షణకై సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌యాత్ర

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:17 AM

తీర ప్రాంత రక్షణలో భాగంగా అవగాహన కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్‌ బృందం సైకిల్‌ యాత్రం చేపట్టింది. ఈనెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రారంభించారు.

తీరప్రాంత రక్షణకై సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌యాత్ర
సైకిల్‌ యాత్రలో పాల్గొన్న సీఐఎస్‌ఎఫ్‌ బృందం

సోంపేట/కంచిలి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత రక్షణలో భాగంగా అవగాహన కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్‌ బృందం సైకిల్‌ యాత్రం చేపట్టింది. ఈనెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రారంభించారు. గుజ రాత్‌ రాష్ట్రం లక్‌పత్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బకాలి నుం చి రెండు బృందాలుగా సైకిల్‌ యాత్రను ప్రారంభించారు. ఒక్కో బృందంలో 25మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌ బృందం ఒడిశా మీదుగా శనివారం సోంపేట చేరుకుంది. ఈ బృందానికి ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఘనస్వాగతం లభించింది. కమాం డెంట్‌ ఏఎన్‌డీ హనీఫ్‌, డిప్యూటీ కమాండెంట్‌ వీకే ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఈ బృందం సైకిల్‌ యాత్ర చేప ట్టింది. రెండు బృందాలు ఈ నెల 31వ తేదీలోగా కన్యా కుమరి చేరుకొనేలా ప్రణాళిక వేశారు. మొత్తం రెండు బృందాలు కలిపి 6,553 కిలోమీటర్లు సైకిల్‌ యాత్రం చేపట్టగా పశ్చిమబెంగాల్‌ బృందం 2800కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 16 , 2025 | 12:17 AM