Share News

lands should be protected. దళిత, గిరిజనుల భూములను కాపాడాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:03 AM

lands should be protected. దళి త, గిరిజనుల భూములను ఎమ్మెల్యే మామి డి గోవిందరావు నుంచి కాపాడాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు.

lands should be protected.  దళిత, గిరిజనుల భూములను కాపాడాలి
నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

పాతపట్నం, ఏప్రిల్‌15(ఆంధ్రజ్యోతి): దళి త, గిరిజనుల భూములను ఎమ్మెల్యే మామి డి గోవిందరావు నుంచి కాపాడాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగ ళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ మా ట్లాడుతూ.. 40 ఏళ్ల కిందట ల్యాండ్‌ సీలింగ్‌ సమయంలో మాజీ నక్సలైట్‌, ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, పలు దళిత, గిరిజన కుటుంబా లకు ఇచ్చిన భూములపై కన్నేసి సొంతం చేసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి చర్య లు మానుకుని ఇప్పటికే సాగు చేస్తున్న వారి కి పట్టాలివ్వాలని కోరారు. బాధితులకు న్యా యం జరగకుంటే రైతులపక్షాన పోరాటాలకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు ఏఐవై ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతో ష్‌ కొన్న శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు ఆచారి ఆది నారాయణ, త్రినాథ్‌, బాధిత రైతులు దూసి భాస్కరరావు, ముడిదాన శివ, బిడ్డిక భాస్కర్‌, తాలాడ రవణమ్మ, దుక్క చిన్నవాడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:03 AM