Share News

Road accident వ్యాన్‌ ఢీ కొని ఒకరు మృతి

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:53 PM

Road accident బోరుభద్ర ఇసుకబంద చెరువు వద్ద రొయ్యల వ్యాన్‌ ఢీ కొని కాపుగోదాయవలసకు చెందిన నందిగాం కాళీ దుర్గా ప్రసాద్‌ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడని సంతబొమ్మాళి ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.

Road accident వ్యాన్‌ ఢీ కొని ఒకరు మృతి

సంతబొమ్మాళి,ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి): బోరుభద్ర ఇసుకబంద చెరువు వద్ద రొయ్యల వ్యాన్‌ ఢీ కొని కాపుగోదాయవలసకు చెందిన నందిగాం కాళీ దుర్గా ప్రసాద్‌ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడని సంతబొమ్మాళి ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. దుర్గాప్రసాద్‌ బోరుభద్రలోని పెట్రోల్‌బంక్‌లో సెల్స్‌ మన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీ కావడంతో కాలకృత్యాల కోసం రోడ్డుపైకి రాగానే అటు నుంచి వస్తున్న రొయ్యల వ్యాన్‌ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెరువులోపడి వ్యక్తి..

సోంపేట, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొర్లాం తారకేశ్వరా లయం వద్ద ఉన్న చెరువులో పడి మందస మండలంలోని బాలిగాం గ్రామా నికి చెందిన గున్న గున్నయ మృతి చెందినట్లు బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సారా తరలిస్తున్న ఆరుగురి బైండోవర్‌

పాతపట్నం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): సారా తరలిస్తున్న ఆరుగురిని తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌ ఎదుట మంగళవారం బైండోవర్‌ చేసినట్లు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0లో భాగంగా ఇప్పటివరకు 43 మంది సారా తరలింపులకు పాల్పడగా వారిని బైండోవర్‌ చేశామన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:53 PM