సమస్యల పరిష్కారానికే ‘మన ఊరికి-మన ఎమ్మెల్యే’
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:46 PM
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

ఎచ్చెర్ల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఎచ్చెర్లలో ‘మన ఊరుకి మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఇటీవల జరిగి న అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని చాలా సమస్యలను ప్రస్తావించినట్టు చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి అడుకంటుపోయిందన్నారు. రూ.80 కోట్లతో నియోజకవర్గంలో పల్లె పండగలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, మిగిలిన మూడు మండలాల్లో 80 శాతం పనులు జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, మండల టీడీపీ బెండు మల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, కూటమి నేతలు గాలి వెంకటరెడ్డి, వావిలపల్లి రామకృష్ణ, పైడి ముఖలింగం, మెండ రాజారావు, మూకళ్ల భాస్కరరావు, సంపతిరావు నాగేశ్వరరావు, నేతింటి రాజారావు తదితరులు పాల్గొన్నారు.