చెరువు పనులకు శ్రీకారం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:14 AM
: ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం వేదికగా మారింది.

శ్రీకాకుళం క్రైం/అరసవల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం వేదికగా మారింది. నగరంలోని 31వ డివిజన్‌లో జనవరి 29న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ల ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమా న్ని నిర్వహించారు. సాయి నగర్ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న చెరువు సమస్య ను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి అక్కడికక్కడే స్పందించా రు. చెరువు పనులు చేపట్టి కాలనీ వాసులకు వాకింగ్ ట్రాక్, దోబీ ఘాట్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.ప్రసాదరావు, 31వ డివిజన్ ఇన్‌చార్జి విభూది సూరిబాబుల ఆధ్వ ర్యంలో శనివారం చెరువుతో పాటు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు వంద మందితో పరిశుభ్రత కార్యక్రమాలు చేప ట్టారు. దట్టంగా పెరిగిన తుమ్మ చెట్లను జేసీబీ లతో కమిషనర్ తొలగించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్వయంగా తుమ్మచెట్లు తొలగిం చి, పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకుంటున్నాం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లా డుతూ కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, తాను ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. దీనిలో భాగంగా సాయినగర్ కాలనీలోని చెరువును శుభ్ర పరుస్తున్నామని చెప్పారు. త్వరలో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు దోబీఘాట్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మొక్కలు నాటి ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు.
ఫ అమృత్ పథకంతో తాగునీరు..
నగర పాలక సంస్థ పరిధిలో విలీనమైన పం చాయితీలకు అమృత్ 2.0 పఽథకంలో భాగంగా తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈ నెల 12న పెద్దపాడు, కళ్లేపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించడంతో వాటిని పరిశీ లించామన్నారు. 10 వేల కొళాయి కనెక్షన్లను విలీన పంచాయి తీలకు అందిస్తామన్నారు. పెద్దపాడులో 100 కేఎల్ ట్యాంక్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా.సుధీర్ కుమార్, టీడీపీ 31వ డివిజన్ ఇన్‌చార్జి విభూది సూరిబాబు, నాయకులు రెడ్డి శంకర్, అంబటి లక్ష్మీరాజ్యం, నవీన్, బాబా పాల్గొన్నారు.