Share News

60 రోజుల్లో సమస్య పరిష్కారం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:04 AM

వినియోగదారుల పరిష్కార న్యాయ స్థానం దృష్టికి వచ్చిన సమస్యను 60 రోజు ల్లో పరిష్కరిస్తామని కన్జ్యూమర్‌ గ్రీవెన్స్‌ ఫోరం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌ బి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మండ లంలోని తొగరాం ప్రభుత్వజూనియర్‌ కళా శాల విద్యార్థులకు విద్యుత్‌ వినియోగదా రుల పరిష్కార న్యాయస్థానంపై అవగా హన కార్యక్రమం నిర్వహించారు.

 60 రోజుల్లో సమస్య పరిష్కారం
మాట్లాడుతున్న సత్యనారాయణ

ఆమదాలవలస, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల పరిష్కార న్యాయ స్థానం దృష్టికి వచ్చిన సమస్యను 60 రోజు ల్లో పరిష్కరిస్తామని కన్జ్యూమర్‌ గ్రీవెన్స్‌ ఫోరం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌ బి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మండ లంలోని తొగరాం ప్రభుత్వజూనియర్‌ కళా శాల విద్యార్థులకు విద్యుత్‌ వినియోగదా రుల పరిష్కార న్యాయస్థానంపై అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912కు కాల్‌ చేయాలని సూచించారు.అనంతరం ఆమదాలవలసలో ఇండస్ర్టీయల్‌ ఏరియా లో ఉన్న తొగరాం సెక్షన్‌ కార్యాలయంలో వినియోగదారుల పరిష్కార న్యాయ స్థానం కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ ఏడాది 12 క్యాంప్‌ కోర్టులను ఏర్పాటుచేసి ప్రజల నుంచివినతులు స్వీకరించినట్లు తెలిపారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో ఉన్న విని యోగదారులు సీజీఆర్‌ఎఫ్‌ కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చున న్నారు. ఇప్పటివరకూ 8669 దరఖాస్తులు రాగా 8482 దరఖాస్తులను పరి ష్కరించినట్టు తెలిపారు.ఇందులో వినియోగదారులకు సుమారు15లక్షల వరకు నష్టపరిహారాన్ని అందించినట్టు చెప్పారు. కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్‌ ఫైనాన్స్‌ సభ్యుడు సుబ్బారావు, టెక్నికల్‌ సభ్యులు సులేఖరాణి, ఇండిపెండెంట్‌ సభ్యుడు మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సురేష్‌కుమార్‌, డీఈఈ బి.రవికుమార్‌, రూరల్‌ ఏఈ రవికుమార్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు పాల్గొన్నారు.

:

Updated Date - Apr 09 , 2025 | 12:04 AM