Share News

ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:15 AM

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని దత్త విజయానంద స్వామి అన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
పాదయాత్ర చేస్తున్న స్వామిజీ

శ్రీకాకుళం కల్చరల్‌/ అరసవల్లి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని దత్త విజయానంద స్వామి అన్నారు. నగరంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి శుక్రవారం వచ్చిన ఆయన భక్తులతో మాట్లాడుతూ.. భగవన్నామస్మరణతో మనశ్శాంతి కలుగుతుందన్నారు. చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు హిందూ సంప్రదాయాలు, పండుగ విశేషాలను తెలియజేయాలని తల్లిదం డ్రులకు సూచించారు. అన్యమత ప్రచారాన్ని హిందువులంతా అడ్డు కోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన అరసవల్లి సూర్యనా రాయణ స్వామిని, రమ్య తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని, మరికొన్ని ఆలయాలను దర్శించుకున్నారు. దత్తాత్రేయ క్షేత్రం నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమాల్లో పన్నాల నరసింహమూర్తి, బాబ్జీ, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:15 AM