Share News

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 05:01 AM

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకేశ్ మంగళగిరిలో జరిగిన వేడుకల్లో పాల్గొని, పార్టీ విజయాలను, సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు చిహ్నమని, చంద్రబాబు అభివృద్ధికి మార్గదర్శకుడని అన్నారు. పార్టీలో ప్రక్షాళన తన నుంచే ప్రారంభమవుతుందని, కొత్త నేతలకు అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు.

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

నేతల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు

ఇదే నా స్టైల్‌.. రెడ్‌బుక్‌ పేరు చెబితే కొందరికి గుండెపోటు

టీడీపీ జెండా పీకేస్తామన్నవారే అడ్రస్‌ లేరు: లోకేశ్‌

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పసుపు జెండా అంటేనే తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమైతే.. తొలి గెలుపు ఒక చరిత్ర అన్నారు. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యమన్నారు. టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడారు. ‘ఎన్టీఆర్‌ అనే మూ డు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయి.. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్‌. దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు. దేశంలో అత్యధిక పింఛను ఇస్తుంది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 177 హామీల్లో 55 పూర్తిగా అమలు చేశాం. 49 పాక్షికంగా అమలు చేశాం. దాదాపు సగానికి పైగా హామీలు అమలయ్యాయి.’’ అని లోకేశ్‌ వివరించారు. రెడ్‌ బుక్‌ గురించి చెబితే కొంత మందికి గుండెపోటు వస్తుందని, కొంత మంది బాత్‌ రూంలో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారన్నారు. ‘అర్ధం అయిందా రాజా ?’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం జెండా పీకేస్తామన్నవారే అడ్రెస్‌ లేకుండా పోయారన్నారు. టీడీపీకి గల్లీ పాలిటిక్స్‌తోపాటు ఢిల్లీ పాలిటి క్స్‌ కూడా తెలుసునన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా, ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలే మన కు ముఖ్యమన్నారు. అబ్దుల్‌ కలాం ను రాష్ట్రపతిగా చేయడంలో, అంబేడ్కర్‌కు భారతరత్న రావడంలో.. బాలయోగిని పార్లమెంటు తొలి దళిత స్పీకర్‌గా చేయడంలో టీడీపీ కృషి ఉందని లోకేశ్‌ గుర్తుచేశారు.


పార్టీ ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి

‘‘కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడుతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. పార్టీ కోసం కష్టపడే కార్యకర్త, నాయకులను గుర్తించడమే నా లక్ష్యం. అందుకే పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. రెండు విడతలు ఒక పదవి చేసిన తర్వాత అంతకన్నా ఉన్నత పదవికైనా వెళ్లాలి లేదా ఒక విడత విరామమైనా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో అన్ని స్థాయిల్లో కదలిక వస్తుంది. గ్రామస్థాయి నాయకుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి పనిచేస్తున్నా.. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి. సీనియర్లను గౌరవిస్తా. పనిచేసే జూనియర్లకు ప్రమోషన్‌ ఇస్తా.. ఇదే నా స్టైల్‌. పార్టీ మరో 40 ఏళ్లు బతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసే వారికే పదవి అనేది నా నినాదం. నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


అరాచకానికి ఎదురొడ్డాం.. ప్యాలె్‌సలు బద్దలగొట్టాం

‘‘గడిచిన ఐదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను ఎదుర్కొన్నాం. దేవాయలం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలబడిన ఘనత టీడీపీ కార్యకర్తలదే. పార్టీ అధినేత ఇంటికి తాళ్లు కడితే తెంచుకుని పోరాడాం. మందుపాతరకే భయపడని బ్లడ్‌ మనది. కామిడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామన్న వారికి నేడు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలే ఇంటికి పంపారు. ప్యాలె్‌సలు బద్దల కొట్టాం.. అరాచకవాదులను ఇంటికి పంపాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్‌ రేటు 94 శాతం. 58 శాతం ఓటు షేరు సాధించాం.. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్‌ స్వీప్‌ చేశాం. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్‌ షేర్‌ సాధించాం. ప్రజలు ప్రజాప్రభుత్వం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు సుమారు రూ.140 కోట్లు ఖర్చు చేశాం.’’


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 05:03 AM