Share News

Political Criticism :రాజు ప్రజల్లోకి వెళ్లకపోతే.. కోటరీ.. కోటా ఏదీ మిగలదు

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:18 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని ఇటీవల ప్రకటించిన విజయసాయిరెడ్డి..

 Political Criticism :రాజు ప్రజల్లోకి వెళ్లకపోతే.. కోటరీ.. కోటా ఏదీ మిగలదు

జగన్‌ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్‌

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని ఇటీవల ప్రకటించిన విజయసాయిరెడ్డి.. శనివారం ఎక్స్‌ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్‌ చేశారు. కోటరీపై జగన్‌ ఆధారపడితే.. చివరకు ఆ కోటరీ వదలదు. కోట కూడా మిగలదు.. అంటూ హితోక్తులతో కూడిన హెచ్చరిక చేశారు. ‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్నికష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా.. ఆహా రాజా.. ఓహో మహరాజా! అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి, కోటరీ తన ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు. రాజ్యం కూడా పోయేది. మహారాజు తెలివైనవాడు అయితే.. మారువేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. కోటరీ మీద వేటువేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు.


కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు. కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలోనైనా జరిగేది ఇదే!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Updated Date - Mar 16 , 2025 | 05:18 AM