బిందె నీటికి బండెడు కష్టం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:00 AM
మండలంలోని పగిడిరాయి మజరా గ్రామం పగిడిరాయి కొత్తూరు గ్రామంలో దాదాపు 2,500 మంది నివాసమున్నారు. అయితే ఈ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బిందె నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుంటున్నారు.

పగిడిరాయి కొత్తూరు గ్రామంలో తాగునీటి కష్టాలు
తుగ్గలి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పగిడిరాయి మజరా గ్రామం పగిడిరాయి కొత్తూరు గ్రామంలో దాదాపు 2,500 మంది నివాసమున్నారు. అయితే ఈ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బిందె నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుంటున్నారు.
పనిచేయని తాగునీటి బోర్లు
గ్రామాల్లో తాగునీటి బోర్లు పని చేయడం లేదు. దీంతో పక్క గ్రామమమైన బొళ్లవానిపల్లె నుంచి తాగునీటి సరఫరా చేస్తుండేవారు. అయితే కొద్ది రోజుల నుంచి అక్కడి నుంచి కూడా నీరు రావడం లేదు.
వ్యవసాయ బోర్లే శరణ్యం
గ్రామంలో నీటి పథకాలు పనిచేయకపోవడంతో వ్యవసా య బోర్లను ఆశ్రయిస్తున్నారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు వాహనాలు, ఎడ్లబండ్లు, బిందెలు భూజానకెత్తుకుని నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 9 రోజుల నుంచి గ్రామస్థులు అవస్థలు పడుతున్నా ఆర్‌డబ్లూఎస్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
తొమ్మిది రోజుల నుంచి తాగునీరు అందడం లేదు. గ్రామ శివార్లలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంలోని తోటల కు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. - చక్రపాణి, పగిడిరాయి కొత్తూరు
సమస్య పరిష్కరిస్తాం
పగిడిరాయి కొత్తూరులో తాగునీటి ఎద్దడిని పరిష్కరిస్తాం. త్వరలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. - నరేష్, ఆర్‌డబ్లూఎస్ అధికారి.