Share News

భూ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:01 AM

భూ సమస్యలను పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య ఆదేశించారు. మంగళవారం ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామం ఆర్‌బీకేలో మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ ఆద్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు

భూ సమస్యలు పరిష్కరించాలి
శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

అధికారులను ఆదేశించిన జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

ఆలూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలను పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య ఆదేశించారు. మంగళవారం ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామం ఆర్‌బీకేలో మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ ఆద్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. శనగకు ప్రభుత్వం మద్దతు ధర రూ.5650లుగా నిర్ణయించిందన్నారు. అనంతరం తమ భూముల ఇబ్బందులు, ఈనాం భూములపై రైతులు జేసీ దృష్టికి తీసుకెళ్ళారు. స్పందించిన ఆమె సమస్యను పరిష్కరించాలని ఆర్డీవో భరత్‌ నాయక్‌, తహసిల్దార్‌ గోవింద్‌ సింగ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ బసవన్న గౌడ్‌, వీఆర్‌వో అమరేశ్వర రెడ్డి, మార్కు ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ రాజు, కేడీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:01 AM