DEVoTIONAL : వైభవంగా వ్యాసరాయ ఆరాధనోత్సవం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:11 AM
పాతూరులోని బృందా వన ఆంజనేయస్వామి (చిన్న ఆంజనేయస్వా మి) దేవస్థానంలో మం గళవారం వ్యాసరాయ స్వామి 486వ ఆరాధనో త్సవాలను వైభవంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అక్కడి నరసింహస్వామి మూల విరాట్‌కు, రాఘ వేంద్రస్వామి, వ్యాసరాయ బృందావనాలకు నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, వేదపండితుల ప్రవచనాలు నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పాతూరులోని బృందా వన ఆంజనేయస్వామి (చిన్న ఆంజనేయస్వా మి) దేవస్థానంలో మం గళవారం వ్యాసరాయ స్వామి 486వ ఆరాధనో త్సవాలను వైభవంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అక్కడి నరసింహస్వామి మూల విరాట్‌కు, రాఘ వేంద్రస్వామి, వ్యాసరాయ బృందావనాలకు నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, పంచామృతాభిషేకాలు, వేదపండితుల ప్రవచనాలు నిర్వహించారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం సాయి ట్రస్టు సమన్వయంతో ప్రభుత్వ సర్వజనాస్పత్రి వద్ద దాదాపు 600 మందికి అన్నదానం చేశారు. రాత్రికి ఆలయ ఆవరణలో స్వస్తి వాచనం నిర్వహించారు. కార్యక్రమంలో మఠాధికారి శ్రీకాంత, మేనేజర్ హరినారాయణరావు, డాక్టర్ రఘునాథ్, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....