చేనేతలకు చంద్రన్న చేయూత
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:09 AM
గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేతలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. గతంలో ఉన్న ఉచిత 100యూనిట్ల విద్యుత్‌ను 200కు పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే పవర్‌లూమ్‌కు కూడా 500 యూనిట్లు ఇచ్చే విధంగా రెండు హామీలు చేశారు. ఈక్రమంలో సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రెండు హామీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో చీరాల నియోజకవర్గ పరిధిలోని చేనేత కుటుంబాలు అభినందనల జల్లు కురిపించాయి.

నివాసాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
హామీ నెరవేర్చిన సిఎంకు నేతన్నల అభినందనలు
చీరాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేతలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. గతంలో ఉన్న ఉచిత 100యూనిట్ల విద్యుత్‌ను 200కు పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే పవర్‌లూమ్‌కు కూడా 500 యూనిట్లు ఇచ్చే విధంగా రెండు హామీలు చేశారు. ఈక్రమంలో సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రెండు హామీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో చీరాల నియోజకవర్గ పరిధిలోని చేనేత కుటుంబాలు అభినందనల జల్లు కురిపించాయి. గత ప్రభుత్వం అరకొర హామీలు చేసిన అమలు ప్రక్రియలో తీవ్రమైన కోతలు విధించినట్లు చెప్తుతున్నారు. తాజాగా టీడీపీ కూటమి తీసుకున్న నిర్ణయంతో థాంక్యూ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు.
పూట గడవడం కష్టంగా ఉండేది
అనుకోని రీతిలో నా భర్త సుమారు ఐదేళ్ల కిందట గుండెపోటుతో మరణించారు. దీంతో ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబం ఆర్థికపరమైన సమస్యల్లో కూరుకుపోయింది. మరోవైపు అప్పటి పలు రకాల పరిస్థితులతో చేనేత రంగానికి సంబంధించి ధరలు పెరిగి, నిత్యావసరాల ధరలు పెరిగి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దీంతో చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. చాలా ఆనందంగా ఉంది.
- లేళ్ల సునీత, చేనేత కార్మికురాలు
మాట మార్చ లేదు, మడమ తిప్పలేదు
ఎన్నికల హామీలు అందించే క్రమంలో టీడీపీ కూటమి మాట మార్చలేదు, మడమ తిప్పలేదు. ఇచ్చిన హామీలో భాగంగా నేతన్నల నివాసాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్ లూమ్‌కు 500 యూనిట్లు అందిస్తున్నట్లు ప్రకటించడం ఆనందదాయకం. చేనేతల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.
- మాన్యం రాము, చేనేత కార్మికుడు