Share News

హైవేపైనే కంటైనర్లు పార్కింగ్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:07 AM

జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. హోటళ్లు, దాబాలు వున్నచోట్ల ఈ సమస్య ఎక్కువగా వుంది.

హైవేపైనే కంటైనర్లు పార్కింగ్‌
నామవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన వరుసగా నిలుపుదల చేసిన భారీ కంటైనర్లు

పాయకరావుపేట, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. హోటళ్లు, దాబాలు వున్నచోట్ల ఈ సమస్య ఎక్కువగా వుంది. పాయకరావుపేట మండలం నామవరం జంక్షన్‌ సమీపంలో ఒక దాబా వుంది. దీని లోపల వాహనాల పార్కింగ్‌కు స్థలం వున్నప్పటికీ భారీ కంటైనర్ల డ్రైవర్లు రోడ్డుపక్కనే నిలుపుదల చేశారు. అనకాపల్లి నుంచి పాయకరావుపేట వరకు ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశం నామవరం జంక్షన్‌గా పోలీసు రికార్డుల్లో వుంది. అటువుంటి డేంజర్‌ జోన్‌లో రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలుపుదల చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:07 AM