Share News

Shift Work- Impact On Women: రాత్రి షిఫ్టుల్లో ఉద్యోగాలు.. మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:27 PM

క్రమపద్ధతి లేకుండా వివిధ షిఫ్టుల్లో పనిచేసే మహిళ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్యకు వ్యవస్థాగత స్థాయిలో పరిష్కారాలు అన్వేషించాలని సంస్థలకు నిపుణులు సూచిస్తున్నారు.

Shift Work- Impact On Women: రాత్రి షిఫ్టుల్లో ఉద్యోగాలు.. మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
Impact Of Shift Work On Women

ఇంటర్నెట్ డెస్క్: పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించారనేందుకు చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం, ప్రపంచయుద్ధాల కారణంగా మహిళలు కూడా కార్మిక శక్తిలో భాగం కావాల్సి వచ్చింది. అయితే, ఇటీవల కొన్ని దశాబ్దాలుగా మాత్రమే మహిళలు పురుషులతో సమానంతో తమ హక్కులకోసం ఉద్యమిస్తున్నారు. ఉద్యోగ వ్యాపార ప్రపంచంలో తమదైన స్థానం కోసం పోరాడుతున్నారు. అనేక ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. అయితే, పగటి షిఫ్టులతో పాటు రాత్రి షిష్టుల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మహిళలు ప్రధానంగా గుండె, పునరుత్పత్తి సంబంధిత సమస్యల బారిన పడుతున్నట్టు తేలింది (Impact Of Shift Work On Women).


నైట్ షిఫ్టుల్లో పనిచేసే మహిళల్లో బీపీ, గుండె సమస్యలతో పాటు ఇతర జీవనశైలి అనారోగ్యాల ముప్పు పెరుగుతోందట. తగినంత నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా బీపీ, డయాబెటిస్ రిస్క్ పెరుగుతోందని అధ్యయనాలు తేల్చాయి.

హార్మోన్లలో అసమతౌల్యత కారణంగా నెలసరి సరిగా రాకపోవడం, సంతానలేమి, ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యల పెరుగుతున్నట్టు కూడా తేలింది. రాత్రిళ్లు ఉద్యోగాల కారణంగా మెలటోనిన్ ఉత్పత్తిలో మార్పుల వల్ల ఈ సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల వల్ల మహిళా ఉద్యోగుల్లో ఒత్తిడి, నిద్రలేమి, భావోద్వేగపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి.


ఈ సమస్యలకు పరిష్కారంగా కంపెనీలు వ్యవస్థాగత స్థాయిలో మార్పులు రావాలని నిపుణులు చెబుతున్నారు. షిఫ్ట్ రొటేషన్స్ ఓ క్రమపద్ధతిలో నిర్వహించడం, మహిళ ఆరోగ్యానికి అనుకూలమైన విధానాలు, షిఫ్ట్ షెడ్యూల్స్ రూపకల్పన వంటివి అవసరమని చెబుతున్నారు. అభివృద్ధి, లాభాల వేటకు మహిళ ఆరోగ్యం బలికాకూడదనేది నిపుణులు చెప్పే మాట. ఉద్యోగుల మానసిక, భావోద్వేగ, శారీర ఆరోగ్యంపైనే సంస్థల సుస్థిరాభివృద్ధి ఆధారపడి ఉంటుందంటున్నారు.

ఇది కూడా చదవండి:

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!

రోజూ 15 నిమిషాల పాటు జాగింగ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..

Read Latest and Health News

Updated Date - Apr 07 , 2025 | 04:27 PM