MI vs RCB Top Rivalries: ఎంఐ వర్సెస్ ఆర్సీబీ.. ఈ 5 రైవల్రీలు మిస్ అవ్వొద్దు
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:29 PM
Today IPL Match: ఈ ఐపీఎల్‌లో మోస్ట్ అవేటెడ్ మ్యాచ్‌కు టైమ్ దగ్గర పడింది. ఇవాళ సాయంత్రం వాంఖడే మైదానంలో జరిగే పోరులో ఈ రెండు కొదమసింహాల మధ్య కొట్లాట జరగనుంది. ఈ నేపథ్యంలో ఏయే స్టార్ల మధ్య రైవల్రీ జరగనుందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో హ్యూజ్ ఫ్యాన్‌బేస్ కలిగిన ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో ఓటమి తర్వాత బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇరు టీమ్స్‌కు విన్ కంపల్సరీగా మారింది. రెండు జట్ల మీదా ప్రెజర్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ మ్యాచుల్లో ఓడిన ముంబైపై ఆ డోస్ కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవాళ గెలిచి తీరాలని ఆ టీమ్ పంతంతో ఉంది. అభిమానులు కూడా ప్లేయర్ల విన్యాసాలు చూసేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మండే ఫైట్‌లో ఏయే ఆటగాళ్ల మధ్య రైవల్రీ జరగనుందో ఇప్పుడు చూద్దాం..
రోహిత్ వర్సెస్ హేజల్‌వుడ్
వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో పెద్దగా ఎదురుపడలేదు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రం వీళ్లు పలుమార్లు తలపడ్డారు. టెస్టుల్లో 2 సార్లు, వన్డేల్లో ఒకసారి, టీ20ల్లో ఒకసారి హిట్‌మ్యాన్‌ను ఔట్ చేశాడు హేజల్‌వుడ్. ఇప్పుడు అతడు మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. రోహిత్ టచ్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో ఇద్దరిలో ఎవరిపై ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కోహ్లీ వర్సెస్ బుమ్రా
ఐపీఎల్‌లో ఈ స్టార్లు 16 సార్లు ఎదురుపడ్డారు. ఇందులో బుమ్రా వేసిన 95 బంతుల్లో 140 పరుగులు చేశాడు విరాట్. అలాగే 5 సార్లు అతడి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కమ్‌బ్యాక్ ఇస్తున్న బుమ్రా వికెట్లు తీయాలనే కసితో ఉన్నాడు. ఆర్సీబీకి ఈసారైనా కప్పు అందించాలనే పట్టుదల కింగ్‌లో కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ వీళ్ల మధ్య సమరం నెక్స్ట్ రేంజ్‌లో ఉండటం ఖాయం.
సూర్యకుమార్ వర్సెస్ భువనేశ్వర్
ఈ ఇద్దరు స్టార్లు క్యాష్ రిచ్ లీగ్‌లో పలుమార్లు తలపడ్డారు. భువీ బౌలింగ్‌లో 82 బంతుల్లో 121 పరుగులు చేశాడు సూర్య. అలాగే అతడి బౌలింగ్‌లో 3 సార్లు పెవిలియన్‌కు చేరాడు. రికార్డుల పరంగా.. భువీపై మిస్టర్ 360 డామినేషన్ కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ ఈ రైవల్రీ మరింత హీటెక్కడం ఖాయం.
పాటిదార్ వర్సెస్ శాంట్నర్
మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే రజత్ పాటిదార్‌కు ముంబై స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌తో గట్టి పోటీ ఖాయం. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో పలుమార్లు ఎదురుపడ్డారు. ఇందులో శాంట్నర్ బౌలింగ్‌లో 37 బంతుల్లో 37 పరుగులు చేసి, ఒకే ఒకసారి ఔట్ అయ్యాడు పాటిదార్.
డేవిడ్ వర్సెస్ బౌల్ట్
ఆర్సీబీ పించ్ హిట్టర్ టిమ్ డేవిడ్, ముంబై స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ మధ్య డెత్ ఓవర్లలో పోరు ఖాయం. ఐపీఎల్‌లో బౌల్ట్ బౌలింగ్‌లో 22 బంతుల్లో 35 రన్స్ చేశాడు డేవిడ్. ఒకసారి అతడికి దొరికిపోయాడు.
హార్దిక్ పాండ్యా వర్సెస్ యశ్ దయాల్
డెత్ ఓవర్లలో ఈ ఇద్దరి మధ్య కూడా రసవత్తర పోరు ఖాయం. క్యాష్ రిచ్ లీగ్‌లో దయాల్ బౌలింగ్‌లో పాండ్యా 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు పాండ్యా. ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. అయితే దయాల్ మునుపటి కంటే ఇప్పుడు చాలా బెటర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు.
ఇవీ చదవండి:
హిట్‌మ్యాన్ నిలుస్తాడా.. చేజ్‌మాస్టర్ గెలుస్తాడా..
సన్‌రైజర్స్‌ను ఓడిస్తున్న కమిన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి