Share News

అంబరాన్నంటిని హోలీ సంబరాలు

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:15 AM

జిల్లావ్యాప్తంగా శుక్రవారం రంగుల పండుగ హోలీని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

అంబరాన్నంటిని హోలీ సంబరాలు

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

జిల్లావ్యాప్తంగా శుక్రవారం రంగుల పండుగ హోలీని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ...ఉత్సాహంగా గడిపారు. నగర పరిధిలోని పోర్టు స్టేడియం, ఎంజీఎం గ్రౌండ్‌తో పాటు పార్క్‌, రాడిసన్‌ బ్లూ హాటళ్లలో ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించారు. అలాగే ఆర్కే బీచ్‌, రుషికొండ బీచ్‌లలో నగరవాసులు ముఖ్యంగా యువతీ యువకులు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలు బెలూన్స్‌ ఎగురవేస్తూ, వాటర్‌ గన్స్‌తో రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనందించారు. అపార్టుమెంట్లలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. హోలీని పురస్కరించుకుని మార్వాడీలు ఆర్కే బీచ్‌లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం హోలీ సంబరాలను జరుపుకున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 01:15 AM