Share News

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఎంతపని చేసిందంటే.. చివరకు కన్నతల్లిని కూడా

ABN , Publish Date - Jan 31 , 2025 | 10:59 AM

Online Game: కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారిపోయాడు. ఇది చూసిన కన్నతల్లి ఎన్నో సార్లు కొడుకుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల భవిష్యత్ పాడవుతుందని ఎన్నో సార్లు కొడుకుకు సర్ధిచెప్పింది కూడా. అయినప్పటికీ అతడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ విషయం వెనక్కి తగ్గలేదు. పగలు, రాత్రి అదే పనిగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాడు.

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఎంతపని చేసిందంటే.. చివరకు కన్నతల్లిని కూడా
Online Game

విశాఖపట్నం, జనవరి 31: ఆన్‌లైన్ గేమ్స్‌కు యువత పెద్ద ఎత్తున బానిసలుగా మారిపోతున్నారు. ఏదో సరదాకు ఆడుతున్న గేమ్స్‌ కాస్తా పలువురికి వ్యసనంగా మారిపోతున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల కొంతమంది పిల్లలు చదువుపైన సరైన దృష్టి పెట్టలేని పరిస్థితి. దీంతో చదువులో వెనకబడిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆన్‌లైన్స్‌ గేమ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. అయితే పెద్దవాళ్లు వేరే పనులతో కాస్త ఆన్‌లైన్‌గేమ్స్‌ పక్కన పెడుతున్నప్పటికీ పిల్లలు, యువత మాత్రం అవి లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. తమ పిల్లల పరిస్థితిని ముందే గ్రహించిన కొంతమంది తల్లిదండ్రులు వాటికి దూరంగా ఉంచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


కానీ ఆ గేమ్స్‌‌కు అలవాటు పడిన పిల్లల్లో కొన్ని అనూహ్య లక్షణాలు బయపడుతున్నాయి. ఆన్‌లైన్స్‌ గేమ్స్‌ను వద్దంటే ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతుంటారు. చివరకు కన్న తల్లిదండ్రులు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు ఓ కుమారుడు.. తన తల్లి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆ కుమారుడు చేసిన పనేంటి.. తల్లిని ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

అమరావతికి ఓఆర్‌ఆర్‌ మణిహారం!


విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కన్న తల్లినే కడతేర్చాడు ఓ కుమారుడు. కానీ ఎందుకు తల్లిని చంపాడో తెలిసి ప్రతీఒక్కరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. సదరు కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారిపోయాడు. ఇది చూసిన కన్నతల్లి ఎన్నో సార్లు కొడుకుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల భవిష్యత్ పాడవుతుందని ఎన్నో సార్లు కొడుకుకు సర్ధిచెప్పింది కూడా. అయినప్పటికీ అతడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ విషయం వెనక్కి తగ్గలేదు. పగలు, రాత్రి అదే పనిగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాడు. దాన్ని గమనించిన తల్లి.. కుమారుడిని తీవ్రంగా మందలించింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే అప్పటికే ఆ గేమ్స్ పూర్తిగా బానిసగా మారిన కొడుకు.. తల్లి మందలింపులతో రెచ్చిపోయాడు. ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు.


ఆన్‌లైన్‌ గేమ్స్ వద్దన్న తల్లిని రాడ్‌తో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి అరుపులతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆమె రక్తపుమడుగుల్లో పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త ఇండియన్ నేవి అధికారిగా పోలీసులు గుర్తించారు. అయితే ఆన్‌లైన్ గేమ్స్‌ కోసం కన్న తల్లినే కొడుకు కడతేర్చిన వార్త జిల్లాలో తీవ్ర సంచలనం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

AP Police: పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య.. ఎందుకంటే

Varra Ravinder Case: పులివెందులకు వర్రా రవీంద్రారెడ్డి కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 10:59 AM