Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
ABN , Publish Date - Jan 21 , 2025 | 02:41 PM
Palla Srinivas: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి రూ.11,400 సాయం రావడం అంత చిన్న విషయం కాదని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి కార్మికులు, నిర్వాసితులు పోరాటం మర్చిపోలేనిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుపోతుందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

విశాఖపట్నం, జనవరి 21: స్టీల్ ప్లాంట్‌లో పునరుత్తేజం తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వాజ్‌పేయి సమయంలో ఇప్పుడు రూ.11,400 కోట్లు ఇచ్చి కాపాడింది చంద్రబాబు అని తెలిపారు. బాబు ఉంటేనే స్టీల్ ప్లాంట్ ఉంటుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి రూ.11,400 సాయం రావడం అంత చిన్న విషయం కాదన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి కార్మికులు, నిర్వాసితులు పోరాటం మర్చిపోలేనిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుపోతుందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఐదేళ్లు వైసీపీ నాయకులు ప్లాంట్ కోసం మానేసి కేసులు కోసం మాట్లాడారు తప్ప మరొకటి చెయ్యలేదని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోటి మంది సభ్యత్వం మైలురాయి దాటిందన్నారు. ఈసారి సాంకేతిక బాగా వినియోగించామని.. కేవలం 15 సెకన్లలో మెంబర్ షిప్ ప్రక్రియ పూర్తి అయ్యిందని తెలిపారు. ఈ ఘనత పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, 30 ఏళ్ల పార్టీ నడిపిన చంద్రబాబు, నూతన సాంకేతిక జోడించిన యువ నాయకులు నారా లోకేష్ ది అని వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల
రెండేళ్ల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 99 శాతం కెపాసిటీ నడిపితే సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతామన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన నిర్వాసితుల సమస్య కూడా పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంత సెంటిమెంట్‌తో గడిచిన ఐదేళ్ళ దుర్మార్గపు పాలన నడిచిందన్నారు. గంగవరం పోర్టులో వాటా అమ్మేశారని.. కనీసం ఒక్కరోజు కూడా కార్మికులు దగ్గరకు వైసీపీ నాయకుడు జగన్ వెళ్ళారా అని ప్రశ్నించారు. కేవలం స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేసే ప్రయత్నం చేశారని పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఏం సాధించింది: మంత్రి పార్థసారథి
ఏలూరు జిల్లా: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అనేక గొప్ప పోరాటాల్లో ఉక్కు పోరాటం కూడా ఒకటన్నారు. నష్టం వస్తోందని చెప్పి సామర్థ్యాన్ని లెక్క చేయకుండా ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించుకుందని.. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన సహా ఎంతో మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశారని తెలిపారు. కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఏమీ చేయలేదని విమర్శించారు. 22 మంది ఎంపీలు ఉన్నా కనీసం కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కూడా కోరలేదన్నారు. జగన్ ఆరోజు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించలేదని ప్రశ్నించారు.
ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం రాజధాని, పోలవరం నిర్మాణాల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో విజయం సాధించిందన్నారు. ‘‘గత ప్రభుత్వం ఏం చేసింది,..ఢిల్లీకి అన్ని సార్లు వెళ్లిన జగన్ ఏం చేశారు.. జగన్ సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారా’’ అని నిలదీశారు. కేంద్రం ఒకసారి నిర్ణయం తీసుకుని... తన ఆలోచనపై పునరాలోచన చేయడం అత్యంత అరుదన్నారు. చంద్రబాబు ప్రయత్నం, ఒత్తిడి, ప్రజల మనోభావాలను బలంగా వినిపించడం వల్లే ఇవాళ స్టీల్ ప్లాంట్‌కు జవసత్వాలు వచ్చాయన్నారు. ఇది సాధించడంలో కార్మికులు, ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం మరువలేనిదన్నారు. వైసీపీ ఐదేళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయలేదని మంత్రి పార్థసారథి విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Davos: అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు
Encounter.. కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి
Read Latest AP News And Telugu News