ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు అంతంత మాత్రమే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:54 AM
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, సబ్జెక్టు టీచర్ల నియామకాల్లో ఆలస్యం కారణంగా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను 1,989 మంది రాయగా, వీరిలో 1,208 మంది (60.73 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

- ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 60.73
- ప్రథమ సంవత్సరంలో 43.74 శాతం ఉత్తీర్ణత
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, సబ్జెక్టు టీచర్ల నియామకాల్లో ఆలస్యం కారణంగా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను 1,989 మంది రాయగా, వీరిలో 1,208 మంది (60.73 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సబ్బవరం జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 79 మంది పరీక్షలు రాయగా, 67 మంది (84.81 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాల్లో సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది కళాశాల చివరి స్థానంలో నిలిచింది. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 64 మంది పరీక్షలు రాయగా, కేవలం 20 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 148 మందికి 123 మంది, కృష్ణాదేవిపేట కళాశాలలో 84 మందికి 67, రోలుగుంటలో 156 మందికి 119, కె.కోటపాడులో 58 మందికి 42, మాకవరపాలెం కళాశాలలో 77 మందికి 55, కొత్తకోట కళాశాలలో 197 మందికి 72, కోటవురట్లలో 76 మందికి 47 మంది ఉత్తీర్ణులయ్యారు. అనకాపల్లిలో 44 మందికి 27, పరవాడలో 137 మందికి 83, ఎలమంచిలి కళాశాలలో 312 మందికి 186, నర్సీపట్నం బాలికల కళాశాలలో 11 మందికి 6, మాడుగుల కళాశాలలో 158 మందికి 86 మంది ఉత్తీర్ణులయ్యారు. దేవరాపల్లిలో 98 మందికి 47, పాయకరావుపేటలో 109 మందికి 52, వేములపూడి కళాశాలలో 83 మందికి 39, చోడవరం కళాశాలలో 36 మందికి 15, వేములపూడిలో 11 మందికి 4, పాయకరావుపేట కళాశాలలో 141 మందికి 51 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో...
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ఇంటర్ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ఏడాది 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 2,094 మంది పరీక్షలకు హాజరు కాగా, వారిలో కేవలం 916 మంది(43.74 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కృష్ణాదేవిపేట కళాశాల నుంచి 95 మంది పరీక్షలకు హాజరుకాగా 75, సబ్బవరం కళాశాలకు చెందిన 67కి 47, మాకవరపాలెంలో 53 మందికి 36, రోలుగుంటలో 143కి 86, కోటవురట్లలో 79కి 46, నక్కపల్లిలో 181 కి 97 మంది ఉత్తీర్ణులయ్యారు. అనకాపల్లిలో 62కి 31, పరవాడలో 192 మందికి 92, నర్సీపట్నంలో 82కి 37, మాడుగులలో 149కి 66, రాంబిల్లి మండలం లాలం కోడూరు కళాశాలలో 129 మందికి 51, ఎలమంచిలిలో 109కి 41 మంది ఉత్తీర్ణులయ్యారు. రావికమతం మండలం కొత్తకోట కళాశాలలో 22 మందికి 8, ఎలమంచిలిలో 271కి 97, బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో 76కి 22, పాయకరావుపేట కళాశాలలో 72కి 20, వేములవాడలో 16 కి 4, దేవరాపల్లిలో 77కి 21, చోడవరంలో 87 మందికి 16 మంది ఉత్తీర్ణులయ్యారు.