Share News

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:41 PM

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్రఅధికారి ప్రసాద్‌రాజు కోరారు. సోమవారం స్థానిక అగ్ని మాపక కేంద్రం కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని అమర జీవులకు నివాళులర్పించారు.కార్యక్రమానికి గ్రామకార్యదర్శి జనార్దనరావు పాల్గొన్నారు.

 అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
రాజాం:అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభిస్తున్న జనార్దనరావు:

గజపతినగరం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్రఅధికారి ప్రసాద్‌రాజు కోరారు. సోమవారం స్థానిక అగ్ని మాపక కేంద్రం కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని అమర జీవులకు నివాళులర్పించారు.కార్యక్రమానికి గ్రామకార్యదర్శి జనార్దనరావు పాల్గొన్నారు.

ఫ శృంగవరపుకోట, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యో గులకు శృంగవరపుకోట అగ్నిమాపక శాఖ సిబ్బంది నివాళులర్పించారు. సోమవారం జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్నిమాప క శాఖాధికారి షేక్‌ మదీనా పాల్గొన్నారు.

ఫరాజాం, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి):అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విపత్తుల స్పందన రాజాం అగ్ని మాపక అధికారి టీఎస్‌ఎస్‌ జనార్దనరావు తెలిపారు. రాజాం అగ్ని మాపక వారోత్సవాలు ప్రారంభించారు. అగ్ని ప్రమాదం జరిగితే టోల్‌ ప్రీ నెంబరు 0891-251099 లేదా 100, 101, 108, 104 నెంబర్లకు తెలియజేయాలని సూచిం చారు.కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్‌, పెంకి చైతన్య కుమార్‌, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:42 PM