డీఎం తీరు మార్చుకోవాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:05 AM
పార్వతీపురం ఆర్టీసీ డిపో మే నేజర్ దుర్గా కార్మికుల పట్ల అనుసరిస్తున్న తీరు మార్చుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సీతాలక్ష్మి కోరారు. సోమవారం పార్వ తీపురం డిపోగేటు వద్ద కార్మికులపై డీఎం తీరును నిరసిస్తూ ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.

పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఆర్టీసీ డిపో మే నేజర్ దుర్గా కార్మికుల పట్ల అనుసరిస్తున్న తీరు మార్చుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సీతాలక్ష్మి కోరారు. సోమవారం పార్వ తీపురం డిపోగేటు వద్ద కార్మికులపై డీఎం తీరును నిరసిస్తూ ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ యూనియన్‌సభ్యుల మధ్య చిన్నతగాదాలు వస్తే పరిష్కరించాల్సిన డీఎం, మరో యూనియన్ సభ్యుడు వైపు పక్షపాత వైఖరి అవలంబించి ఎస్ డబ్ల్యూఎఫ్ సభ్యుడు తాతాబాబును సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. 1/2019 సర్క్యులర్‌కు విరుద్దంగా సస్పెండ్‌లు, బదిలీలు చేస్తుండడం బాధకరమని, తాతబాబును విధుల్లోకి తీసుకోవాలని కోరారు.