Drinking Water ఏజెన్సీలో తాగునీటి సమస్య తలెత్తరాదు
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:14 PM
Drinking Water Issue Should Not Arise in the Agency వేసవి దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

పార్వతీపురం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సాయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. గృహ నిర్మాణాలు జరిగే ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, ఐటీడీఏ ఏపీవో మురళీధర్, గామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన జీడిపిక్కలు కొనుగోలు చేయాలి
వీడీవీకేల ఆధ్వర్యంలో నిర్వహించనున్నప్రాసెసింగ్ యూనిట్ల కోసం నాణ్యమైన జీడి పిక్కలను కొనుగోలు చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ సూచించారు. గిరిమిత్ర హాల్‌లో ఆయన మాట్లాడుతూ... జీడి ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఆకర్షణీయమైన ప్యాకింగ్, బ్రాండింగ్ ప్రధానమన్నారు. వాటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రొక్యూర్ మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని, వివిధ ట్రేడర్స్‌తో చర్చించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి బి.మాధవి, వెలుగు ఏపీడీ వై.సత్యంనాయుడు, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.వి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.