Share News

Even before the beginning ప్రారంభానికి ముందే...

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:50 PM

Even before the beginning గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లోపిస్తోంది. దీంతో రోడ్డు నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Even before the beginning ప్రారంభానికి ముందే...
అంటిజోల-మనిగ రోడ్డు ఇలా..

పనుల తీరుపై విమర్శల వెల్లువ

కురుపాం రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లోపిస్తోంది. దీంతో రోడ్డు నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల అంచనాలతో ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న తారురోడ్లు ప్రారంభానికి ముందే పెచ్చులూడిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం జి.శివడ పంచాయతీ పరిధి అంటిజోల-మనిగ మధ్య 2.3 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును సుమారు రూ.1.57 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు. భామిని, కురుపాం మండలాలకు ఇది సరిహద్దు రహదారి. దీని పనులు దాదాపు పూర్తికావచ్చాయి. పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ రోడ్డులోని కొంత భాగంలో తారు పెచ్చులూడుతుండడంపై గిరిజనులు పెదవి విరుస్తున్నారు. రోడ్డు పనులు ఇలానే చేపడతారా? అంటూ మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. ప్రారంభానికి ముందే రోడ్డు ఇలా మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు, జి.శివడ సర్పంచ్‌ మిన్నారావు తదితరులు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్‌ శాఖ జేఈ పి.నాగేశ్వరరావును వివరణ కోరగా.. ‘రోలర్‌ రిపేర్‌ కారణంగా సక్రమంగా రోలింగ్‌ అవ్వలేదు. దీంతో రోడ్డుపై తారు పెచ్చులాడుతోంది. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తిచేస్తాం. నాణ్యత లోపం తల్తెకుండా చూస్తాం. అన్ని పనులు పూర్తయిన తర్వాతే రోడ్డును ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 14 , 2025 | 11:50 PM