Share News

12న పైడిమాంబ దేవర ఉత్సవం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:20 AM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ దేవర ఉత్సవాన్ని మే నెల 12న నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ కేఎస్‌డీ ప్రసాద్‌ చెప్పారు.

12న పైడిమాంబ దేవర ఉత్సవం
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఈవో, అర్చకులు తదితరులు

  • 13న అమ్మవారు చదురుగుడికి రాక

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ దేవర ఉత్సవాన్ని మే నెల 12న నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ కేఎస్‌డీ ప్రసాద్‌ చెప్పారు. మంగళవారం ఈఓ కార్యాలయం లో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ తలయారి రామవరపు చిన పైడిరాజు, ఏవో ఏడుకొండలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏటా వైశాఖ మాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో మే 12న దేవర ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడి నుంచి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా హుకుంపేటలోని పూ జారి ఇంటికి తీసుకువెళ్లి, అక్కడ ఘాటాభిషేకం చేస్తారు. అనంతరం నేలవేషాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగిస్తారని తెలిపారు. ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లా డుతూ పైడిమాంబను రైల్వే స్టేషన్‌ వద్దనున్న వనంగుడి నుంచి మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకురా వడమే దేవర ఉత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ఉత్సవం అక్టోబరు నెలలో జరిగే సిరిమానోత్సవానికి నాంది వంటిదని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

13న చదురుగుడికి..

దేవర ఉత్సవంలో భాగంగా మే 13వ తేదీ ఉదయం 6.30 గంటలకు పైడిమాంబ చదురు గుడి లో భక్తులకు దర్శనమివ్వనున్నా రు. ఆ రోజు ప్రత్యేక పూజలు చే యనున్నారు. ఆ రోజు నుంచి నగ రంలో ఉన్న పైడిమాంబ భక్తులు ముర్రాటలు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. మొక్కుబడులు చెల్లించుకుంటారు.

ప్రత్యేక పూజలు

పైడిమాంబ చదురుగుడి, వనంగుడుల్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం పైడిమాంబకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆలయ ఆవరణలో హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పైడిమాంబ వనంగుడి, చదురుగుడిల్లో వివిధ రకాల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరిం చారు. వివిధ రకాల పిండివంటలు, పండ్లను నేవైద్యంగా సమర్పించారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 16 , 2025 | 12:20 AM