Share News

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:59 AM

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని డీఆర్వో రామునాయక్‌ అధికారులను ఆదేశించారు.

 అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని డీఆర్వో రామునాయక్‌ అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్‌ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఆయన చాంబర్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మొదటి విడతలో 26,785మంది నిరక్షరాస్యుల్లో 23,861మంది అక్షరాస్యులుగా తీర్చిదిద్దగా వారికి పరీక్షలు నిర్వహించడంతో 23,224మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రెండోవిడతలో 30,443మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించామని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో స్వయంసహాయక సంఘాల పరిధిలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వయోజన విద్య ఉపసంచాలకులు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఉల్లాస్‌ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, నిర్దేశిత ఉద్యోగులు భాగస్వాములై లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. 2వ విడత ఉల్లాస్‌ కార్యక్రమం ఈ నెల 16నుంచి ఆరురోజులపాటు సర్వే మొదలుపెట్టి నిరక్షరాస్యులను గుర్తించాల్సిఉందని దానిపై దృష్టి సారించాలన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ జమీవుల్లా, డీఎల్‌డీవో శివారెడ్డి, మెప్మా మేనేజర్‌ రాములు, డీఈవో జనార్దనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:59 AM