అపరాల రైతుల కష్టాలు తీరేలా!
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:43 AM
జిల్లాలో అపరాల రైతుల నుంచి పంట లను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. ఈ ఏడాది తెగుళ్లతో కొనుగోళ్ల ప్రక్రియ జరగడం లేదని రైతుల ఆందోళనతో జిల్లా యంత్రాంగం కస రత్తు చేసింది.

కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటు
ఐదు సొసైటీల పరిధిలో సన్నాహాలు
కసరత్తు చేస్తున్న అధికారులు
రైతుసేవా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ
(ఏలూరు– ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అపరాల రైతుల నుంచి పంట లను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. ఈ ఏడాది తెగుళ్లతో కొనుగోళ్ల ప్రక్రియ జరగడం లేదని రైతుల ఆందోళనతో జిల్లా యంత్రాంగం కస రత్తు చేసింది. అయితే మినుములు, పెసలు కోతలు కోసి పంట లు సిద్ధంగా ఉన్న దశలో ఇంకా కొనుగోలుకు చర్యలు తీసు కోకపోవడంపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. జిల్లాలో కృష్ణా కాల్వ కింద ఏలూ రు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో సుమా రు 30 వేల ఎక రాల్లో రైతులు అపరాలు సాగు చేశారు. పల్లా తెగులు, వైరస్ తెగుళ్ల వల్ల పం టల దిగుబడి తగ్గింది. గత రెండే ళ్ల నుంచి మార్కెట్ రేటు బాగుండడంతో రైతులకు డిమాండ్ పరంగా ధర బాగానే పలికింది. ఈసారి తెగుళ్లు సోకడం దిగుబడులు తగ్గ డంతో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల ఆందో ళన చేయడంతో జేసీ ధాత్రిరెడ్డి ఆదేశాలతో మార్క్‌ఫెడ్ అధికారులు పెసలు క్వింటాల్ రూ.8,682, మినుములు రూ.7,400 కోనుగోలు చేసేందు కు రంగం సిద్ధం చేస్తు న్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏలూరు డీసీఎంఎస్, జాలిపూడి, వట్లూరు, పెద పాడు, దెందు లూరు సొసైటీల ప్రధాన కేంద్రంగా రైతుల నుంచి అపరాలను కొనుగోలు చేస్తారు. వీటి కింద ఉన్న రైతు సేవా కేంద్రాలు సబ్ సెంటర్లుగా కొను గోలుకు పనిచేస్తాయి. పంటల విస్తీర్ణంతో ఆయా రైతుల రైతుసేవా కేంద్రం లో పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. వారికి నిర్దేశిత తేదీల్లో పంటలను కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సమాచారం అందిస్తారు. పంట విక్రయించిన పది రోజు ల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాలు జమ చేస్తారు. తొలిసారిగా ఈ కేంద్రాల ఏర్పాటుతో అపరాల రైతులు విక్రయ కష్టాల నుంచి గట్టెక్కనున్నారు.
నిబంధనల మేరకు కొంటాం..
ప్రభుత్వం నిబంధనల మేరకు 12 శాతం తేమలోపు ఉంటే కొనుగోళ్లకు రైతుల రిజిస్ర్టే షన్ల పూర్తి చేయగానే చర్యలు తీసుకుంటాం. పెసలు 2056 మెట్రిక్ టన్నులు, మినుములు 2099 మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేస్తాం. తొలిసారి కాబట్టి కొన్ని ఇబ్బందులుంటాయి. గోనె సంచుల్లో రైతుల అపరాలను కేంద్రాలకు
వారే తెచ్చుకోవాలి.
– మార్క్‌ఫెడ్ డీఎం ప్రసాద్‌గుప్తా