Share News

జనంతో మమేకం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:09 AM

సీఎం చంద్రబాబు జనంతో మమేకమయ్యారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా తణుకు పర్యటన కొనసాగించారు. పారిశుధ్యంపై ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.

జనంతో మమేకం
స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయిస్తున్న సీఎం చంద్రబాబు.. వేదికపై మంత్రులు నిమ్మల, నారాయణ, గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి, బొలిశెట్టి, కలెక్టర్‌ నాగరాణి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌, అధికారులు, పారిశుధ్య కార్మికులు

పారిశుధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత.. తణుకు అభివృద్ధికి రూ.50 కోట్లు : స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో సీఎం

చీపురు పట్టి.. చెత్త ఊడ్చి.. పారిశుధ్య కార్మికులకు సత్కారం.. కార్యకర్తలకు దిశా నిర్దేశం

సీఎం చంద్రబాబు జనంతో మమేకమయ్యారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా తణుకు పర్యటన కొనసాగించారు. పారిశుధ్యంపై ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. పట్టణాలు, పల్లెలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులను అక్కున చేర్చుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా ఆలకించి వాటికి పరిష్కారం చెప్పారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుం దని భరోసా కల్పించారు. టార్గెట్‌ 2029 ఎన్నికలకు వెళ్లే దిశగా ఏం చేయాలో రూట్‌మ్యాప్‌ ఇచ్చారు. మొత్తంగా సీఎం తణుకు పర్యటన జనంలో జోష్‌ను నింపగా, పార్టీ కేడర్‌లో ఉత్సాహం ఉరకలేసింది.

కార్యకర్తలకు కర్తవ్యబోధ

తణుకు నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్య కర్తలతో జరిగిన సమావేశంలో కర్తవ్యబోధ చేశారు. సీఎం పర్యటనలో తొలిసారి కార్యక ర్తలతో ఇలా సమావేశం కావడం.. అందునా రెండు గంటలు గడపడం విశేషం. ఎన్నికల ముందు పార్టీ కార్యక్రమాలను అమలు చేయ డంలో మంచి మార్కులను పొందిన కార్యకర్త లను పేరు పేరునా పిలిచి అభినందించారు. కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బూత్‌ల వారీగా గ్రేడ్‌లు ఇచ్చారు. తణుకు నియోజకవర్గంలో డి గ్రేడ్‌లో 14 బూత్‌లు, బిలో 124, ఏలో 24 ఉన్నాయని వెల్లడించారు. 2029 ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కష్టపడే వారికి పార్టీలో ఎప్పు డూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎప్పుడూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముందుకు వెళ్లలేదు. కాని ఈసారి పార్టీ పోటీ చేసిన చోటల్లా గెలు పొందింది. ఇది పార్టీలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణకు సంకేతం. పార్టీ యంత్రాంగం ఎప్పటి కప్పుడు ప్రతిష్టాత్మకం గానే ఉండాలి. తెలు గుదేశంకు మొద టి నుంచి పటి ష్టమైన యం త్రాంగం ఉంది. ఎన్ని ఒడిదుడు కులు, ఇబ్బం దులు వచ్చినా పార్టీ మాత్రం ఏనాడూ అధైర్యప డలేదు. కార్యకర్తలు, నేతలు ఎప్పుడూ మా వెంటే ఉన్నారు. ప్రజలు, కార్యకర్తలు నన్ను ఆదరించారు. ఎవరికీ దక్కని గౌరవం పార్టీకి, నాకు దక్కింది. ఇది నా పూర్వ జన్మ పుణ్యమంటూ హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

గోదావరి జిల్లాల్లో నల్లరేగడి మట్టి ఉంటుంది. ఈ కారణంగా రహదా రులు తరచూ దెబ్బ తింటాయి. ఎప్పటికప్పుడు వేసుకోవాలి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. అన్నీ గోతులు పడ్డాయి. మేం రాగానే తొమ్మిది నెలల్లో వాటిని పూడ్చాం. రహదారులు వేస్తాం. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. తణుకు అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

– చంద్రబాబు

భీమవరం/తణుకు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈసారి తణుకులో చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేస్తూనే, సంక్షే మ పథకాలు, సంపద సృష్టి, అభి వృద్ధిపై చంద్రబాబు తన విజ న్‌ను ప్రజల ముందు ఆవిష్క రించారు. పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర–2047 విజన్‌లో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ ఒక భాగమని స్పష్టం చేశారు. ఉండవల్లి నుంచి చంద్రబాబు హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు తణుకు చేరు కున్నారు. ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయ కులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలి కారు. తర్వాత ఎన్టీఆర్‌ పార్క్‌లో పారిశుధ్య కార్మికులతో భేటీ

అయ్యారు. వారితో కలిసి చీపురు పట్టి చెత్తను ఊడ్చి ఎత్తిపో శారు. ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికుడిని ఆప్యాయంగా

పలకరించారు. వారితో గ్రూపు ఫొటోలు దిగారు. ఎన్టీఆర్‌ పార్క్‌కు రెండు నెలల్లో పూర్వ వైభవం తీసుకురావాలని మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణకు సూచించారు. కూరగాయల మార్కెట్‌ను సందర్శిం చారు. అక్కడ వ్యర్థాలతో కంపోస్ట్‌ తయారు చేసేందుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐక్యనగర్‌ పార్క్‌ను పరిశీలించారు. దాతలు, ప్రభుత్వ సహకారంతో రూ.60 లక్షలు వెచ్చించి పార్క్‌ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

ప్రజావే దిక పూర్తి భిన్నం

జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎంకు ఇరువైపులా పారిశుధ్య కార్మికులు ఆశీనులయ్యారు. కుర్చీలు లేవు. గోడ మాదిరిగా

వేదికను ఏర్పాటుచేశారు. దానిపైనే చంద్రబాబు సహా మంత్రు లు, ప్రజా ప్రతినిధులు కూర్చున్నారు. ప్రజల నుంచి తొలుత వినతులు స్వీకరించారు. సమయాభావంతో ఎక్కువ మంది అభిప్రాయాలను సేకరించలేకపోయారు. ఉన్న కొద్దిపాటి సమయంలో రాష్ట్ర భవిష్యత్తు, ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రజా ప్రభుత్వం అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్రపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

తప్పులు చేసి ఎదురుదాడి

వైసీపీ హయాంలో నేతలు తణుకులో టీడీఆర్‌ బాండ్‌లను అక్రమంగా ఇచ్చేసి వాటిని కప్పి పుచ్చుకోవడానికి ఎదురు దాడి చేస్తున్నారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికు మార్‌, నారాయణ, నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి, కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, పితాని సత్యనారాయణ, బొమ్మి డి నాయకర్‌, పార్టీ జిల్లా అధ్య క్షుడు మంతెన రామరాజు, అంగర రామ్మోహన్‌, తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో అడుగుపెట్టి

సరిగ్గా 41 ఏళ్ల క్రితం ఇదే రోజు శనివారం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాను. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధిగా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. సమై క్యాంధ్రలో అత్యధికంగా తొమ్మి దేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించారు. ప్రతిపక్ష పాత్రను పోషించా. విలువలకు కట్టుబడ్డాను. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా తుది శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలుగు జాతి అభివృద్ధికి కష్టపడతాను.. అంటూ కార్యకర్త భాస్కరరావు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానంగా చెప్పారు.

Updated Date - Mar 16 , 2025 | 01:09 AM