ఇక్కడ ఇల్లు కట్టలేం !
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:43 AM
ప్రధానమంత్రి ఆవాస యోజనలో గత ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు నత్తనడకగా సాగాయి. పల్లెటూరులో పట్టణ ప్రజలకు సెంటు స్థలం కేటాయించారు. అది కూడా ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో స్థలాలు ఇచ్చారు. దీనివల్ల పట్టణ లబ్ధిదారులు సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి మొగ్గుచూపడం లేదు.

అనువుగా లేని జగనన్న లేఅవుట్లు.. ఏళ్లు గడుస్తున్నా ఖాళీగానే స్థలాలు
ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా.. రోడ్డు కూడా లేని చోట్ల పంపిణీ
ఇళ్లు కట్టుకునేందుకు మక్కువ చూపని వేలాది మంది లబ్ధిదారులు
నెరవేరని సొంతింటి కల.. జిల్లాల్లో పదుల సంఖ్యలో ఖాళీ లే అవుట్లు
భీమవరంలో 3,958 మందికి అందని ద్రాక్షగా ఇంటి స్థలం
ప్రత్యామ్నాయం చూపాలని కూటమి ప్రభుత్వానికి వినతులు
ప్రధానమంత్రి ఆవాస యోజనలో గత ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు నత్తనడకగా సాగాయి. పల్లెటూరులో పట్టణ ప్రజలకు సెంటు స్థలం కేటాయించారు. అది కూడా ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో స్థలాలు ఇచ్చారు. దీనివల్ల పట్టణ లబ్ధిదారులు సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి మొగ్గుచూపడం లేదు. మరోవైపు డెల్టా ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే పెట్టుబడి వ్యయం అధికం అవుతోంది. మట్టి స్వభావాన్ని బట్టి పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్నారు. నాణ్యతతో ఇల్లు కట్టుకోవాలంటే రూ. 5 లక్షల వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఫలితంగా జిల్లాలో 72 వేల ఇళ్లకు 60 శాతం పూర్తి కావడం గగనమై పోయింది. ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సుమారు 35 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌తో నిర్మిస్తున్న ఇళ్లు పూర్తిగా నిలచిపోయాయి. జిల్లాలో 11 వేల ఇళ్లు ఆ కేటగిరిలోనే ఉన్నాయి. జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో ఇంకా 37వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.2.50లక్షల మేర రాయితీని పెంచారు. లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంపైన రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 92.00 కోట్లు అదనంగా రాయితీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ సారైనా ఎంత వరకు ఇళ్ల నిర్మాణం చేపడతారనేది వేచి చూడాలి.
భీమవరంటౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : భీమవరం పట్టణానికి సంబంధించి పరిశీలన చేస్తే దాదాపు 70 ఎక రాలకు సంబంధించిన స్థలాల్లో పూడిక చేయకపోవడంతో లబ్ధిదారులకు నేటికి స్థలం కేటాయింపు జరగలేదు. దాదాపు 3,958 మంది లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. ఇప్పుడా స్థలాల్లో మొక్కలు మొలిచాయి.
గునుపూడి లే–అవుట్
యనమదుర్రు లాకుల సమీపంలో దాదాపు 60 ఎకరాల 85 సెంట్ల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసింది. స్థల పూడిక కాకపోవడంతో దాదాపు 3,449 మంది లబ్ధిదారులకు సెంటు స్థలం కోసం ఎదురుచూస్తున్నారు.
భారతీయ విద్యాభవన్స్ వద్ద..
భారతీయ విద్యాభవన్స్ సమీపంలో పట్టణంలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలం కోసం 9 ఎకరాల 70 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో 509 మందికి పట్టాలు ఇచ్చారు. ఈ స్థలం పట్టణానికి దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కూడా స్థల పూడిక జరగలేదు.
విస్సాకోడేరు లే–అవుట్ వద్ద
విస్సాకోడేరు లాకుల వద్ద మునిసిపాల్టీ పంపుల చెరువు గట్టును అనుకుని 108 ఎకరాల 86 సెంట్లలో లే–అవుట్ వేశారు. దాదాపు 4,786 మందికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినా 4,391 మందికి పట్టాలు ఇచ్చారు. ఇక్కడ 2,879 ఇళ్ల నిర్మాణం ప్రారంభమై దాదాపు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పటివరకు 85 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
658కి 106 గృహాల నిర్మాణం
భీమవరం రూరల్ : భీమవరం మండలంలో 21 గ్రామాల్లో 33 జగనన్న లే–అవుట్లు ఏర్పాటు చేశారు. అన్ని లే అవుట్లలో మట్టిపూడిక సరిగా జరగలేదు. 658 ఇళ్లల్లో 106 మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారు. తుందుర్రు గ్రామం, కొమరాడ గ్రామాల్లో జగనన్న లే–అవుట్లలో ఒక్కో గృహం కూడా నిర్మాణం చేయలేదు.
శ్మశానం పక్కనే పేదల స్థలాలు
తణుకు రూరల్ : తణుకు మండలంలో మొత్తం తొమ్మిది గ్రామాల్లో పేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం 25 లే–అవుట్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 3,857 మంది నివాస పట్టాలను అందజేశారు. 3,286 మందికి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేసింది. ఇప్పటివరకు 1,063 ఇళ్లు పూర్తయ్యాయి. వాటిలో ఇంకా 1,711 ఇళ్లు పలు దశలలో నిర్మాణంలో వున్నాయి.
ఒక్క ఇల్లూ నిర్మించని లే–అవుట్‌లు 3
తణుకు రూరల్ కొమరవరంలో రెండు లే–అవుట్‌లు శ్మశానం అవతలవైపున ఉండడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. మొత్తం 122 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ రెండు లే అవుట్‌లు శ్మశానానికి సరిహద్దుగా ఉండడంతో భయపడుతున్నారు. వేరేచోట స్థలం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. యర్రాయి చెరువుకు చెందిన పేదలకు పైడిపర్రు గ్రామంలోని లే అవుట్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల సుమారు పది కిలోమీటర్ల దూరం కావడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు.
శ్మశానంలో నివశించలేం..
కొమరవరంలో శ్మశానం వద్ద ఇంటి స్థలం ఇచ్చారు. శ్మశానం దాటిన తర్వాత సరిహద్దులో ఇల్లు కట్టుకోవాలంటే భయంగా వుంది. చిన్న పిల్లలతో రాత్రి సమయంలో వెళ్లాలంటే భయంగా ఉంది. ఈ విషయం అప్పటి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. వేరే చోట ఎక్కడైనా స్థలం ఇచ్చి ఆదుకోవాలి.
– బొంతా శ్రీలక్ష్మి కొమరవరం
మూడు లే–అవుట్లలో ఇళ్లు నిల్
ఆచంట : ఆచంట మండలంలో 37 లేఅవుట్‌లకు గాను 1,437 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. 350 మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. కొన్ని లేఅవుట్‌లలో కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించని లే–అవుట్‌లు ఉన్నాయి. వాటిలో పెదమల్లంలంక, చినమల్లం, కరుగోరుమిల్లిలో ఒక్కొక్క లే–అవుట్, వల్లూరులో మూడు లే అవుట్‌లలో కనీసం ఒక ఇల్లూ నిర్మించలేదు. మిగతా లే–అవుట్‌లలో కొన్నిచోట్ల మూడు, నాలుగు ఇళ్లు మాత్రమే నిర్మించారు.
అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు
పెంటపాడు : జగనన్న కాలనీలు చాలా చోట్ల అసంపూర్తిగా దర్శన మిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఫౌండేషన్ పరిధిలోనే నిర్మాణాలు నిలిపివేశారు. వీటిలో పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తుంది. మరి కొన్ని గ్రామాల్లో ఆసలు నిర్మాణాలే ప్రారం భించలేదు. పెంటపాడు, జట్లపాలెం, వలూ ్లరుపల్లి గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. ఈ స్థలాలపై స్థానికులు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఇప్పటికీ స్థలాలు రాలేదు. రాచర్లకు చెందిన లబ్ధిదారులకు ప్రత్తిపాడులో స్థలాలు కేటాయించారు.
అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు
పెంటపాడు : జగనన్న కాలనీలు చాలా చోట్ల అసంపూర్తిగా దర్శన మిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఫౌండేషన్ పరిధిలోనే నిర్మాణాలు నిలిపివేశారు. వీటిలో పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తుంది. మరి కొన్ని గ్రామాల్లో ఆసలు నిర్మాణాలే ప్రారం భించలేదు. పెంటపాడు, జట్లపాలెం, వలూ ్లరుపల్లి గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. ఈ స్థలాలపై స్థానికులు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఇప్పటికీ స్థలాలు రాలేదు. రాచర్లకు చెందిన లబ్ధిదారులకు ప్రత్తిపాడులో స్థలాలు కేటాయించారు.
4 వేలకు కట్టినవి 600 మాత్రమే
నరసాపురం రూరల్ : రుస్తుంబాద పంచాయతీ పరిధిలో మంగళగుంటపాలెం వద్ద ఆరేళ్ల క్రితం 90 ఎకరాలు సేకరించారు. పట్టణ పరిధిలోని 4200 మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంకా పూర్తిగా పూడ్చలేదు, ఈ కారణంగా ఇప్పటివరకు 600మంది లబ్థిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వాటిలో 400ఇళ్లు పూర్తయ్యాయి. వైఎస్‌పాలెం పంచాయతీ పరిధిలో 40 మందికి ఇళ్లపట్టాలిచ్చారు. కాలనీలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఒక్క నిర్మాణం జరగలేదు.
పేరుకే ఇళ్ల స్థలాలు
తణుకు : వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నివాసిత స్దలాలు ఏ మాత్రం ఇల్లు కట్టుకునేందుకు వీలు కాని చోట్ల కేటాయించారు. కాపవరం గ్రామ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం అనవుగా లేకపోవడంతో పాటు కనీసం రహదారి సౌకర్యం లేదు. లేఅవుట్‌కు వెళ్లాలంటే ఇల్లిందలపర్రు మీదుగా వెళ్లాలి. లేదా కాపవరం వెళ్లి స్థలాలకు వెళ్లాలి. పట్టణంలోని పలు చోట్ల కేటాయించిన లే–అవుట్లలో నిర్మాణాలు సగం కూడా చేయలేకపో యారు. అజ్జరం లేఅవుట్‌లో 3,374 లబ్ధిదారులకు గాను 1220మంది నిర్మాణాలు చేశారు. పైడిపర్రులో 2,118 మం దికి 2,160 మంది నిర్మించుకున్నారు. డీఎల్‌కే రోడ్డులో 97 మందికి 22 మంది నిర్మించుకున్నారు. కొండాలమ్మ పుంతరోడ్డులో 117మందికి 97మంది, కాపవరంలో 1350 మందికి ఒక్కరూ నిర్మాణం చేపట్టలేదు.
అనువుగా లేదు : పెచ్చెట్టి భవాని
ఏమాత్రం అనువుగా లేని చోట స్థలాలు కేటాయించారు. కాపవరం లేఅవుట్‌లో కనీసం రవాణా సౌకర్యం లేదు. అక్కడ ఇళ్లు నిర్మించుకోవాలని చెబితే ఏమాత్రం సాధ్యం కాకపోవడం వల్ల నిర్మించలేదు.
కేటాయింపులో అన్యాయం : పిట్ల విజయలక్ష్మి
స్థలాల కేటాయింపులో లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఒక ప్రాంతంలో ఉన్న వారికి మరో ప్రాంతంలో స్థలాలు కేటాయించారు. చెప్పినా అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు.
మరో చోట కేటాయించాలి : రెల్లి బాలాజీ
కాపవరం లేఅవుట్ లబ్ధిదారులకు అందరికి మరో చోట స్థలాలు కేటాయిం చాలి. కూటమి ప్రభు త్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
నివాసయోగ్యంగా లేదు ? : ఎ.కృష్ణవేణి
ఒక వార్డులో నివసించే అందరికి సమీపంలో లేఅవుట్‌లో కేటాయంపులు చేయలేదు. దీనివల్ల ఎక్కడో ఉన్న కాప వరం లే–అవుట్‌లో స్థలాలు అందిం చారు. అది కూడా నివాస యోగ్యంగా లేకపోవడంతో ఇల్లు కట్టులేకపోయాం.