Indian Foods - Weight Gain: రాత్రిళ్లు ఈ భారతీయ వంటకాలు తింటారా.. మీకు తెలీకుండానే ప్రమాదంలో కాలుపెడుతున్నట్టే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:16 PM
రాత్రి పూట భారతీయులు సాధారణంగా తినే ఆహారాలతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: రోజూ మనం తినే భారతీయ సంప్రదాయక వంటకాలతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వంటకాలు ఏవో, వాటితో వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్‌లో దాదాపు అందరూ తెల్ల అన్నం తింటుంటారు. అయితే, ఇందులో పీచు పదార్థం చాలా స్వల్పంగా ఉంటుంది. దీంతో, శరీరంలోకి కెలొరీలు అధికంగా చేరి చివరకు కొవ్వుగా మారతాయి. ఇక సాయంత్రాలు జీవక్రియలు నెమ్మదిస్తాయి కాబట్టి రాత్రి భోజనంలో అన్నం వలన బరువు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెల్ల అన్నం కంటే గోధుమ రొట్టెలు బెటరని భావించే కొందరు వాటిపై నెయ్యి ఎక్కువగా వేస్తుంటారు. ఈ అలవాటు కూడా హానికరమే. రాత్రిళ్లు నెయ్యి ఎక్కువగా ఉన్న ఆహారంతో ఒంట్లో కొవ్వు పేరుకునే అవకాశాలు పెరుగుతాయి.
కొందరు పప్పులు, కూరల్లో నూనె ఎక్కువ వేసేస్తుంటారు. వీటిల్లో సహజంగా ఉండే కొవ్వులకు తోడు నెయ్యి, నూనె అధికంగా వేస్తే రాత్రిళ్లు ఆహారం త్వరగా జీర్ణం కాక ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒంట్లో కొవ్వు పేరుకుని బరువు కూడా పెరుగుతారు.
పనీర్‌లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ బటర్ లాంటి వాటిని జోడించి చేసే వంటకాలతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. రాత్రిళ్లు తరచూ ఇది తినే వారు జీవనశైలి వ్యాధులు బారిన పడే ముప్పు పెరుగుతుంది.
బిర్యానీ, పలావ్ వంటి వాటిల్లో కూడె తెల్లబియ్యం, నెయ్యి, మసాలాలు వంటివి అధికంగా ఉంటాయి. వీటిని తింట్లో ఒంట్లోకి కెలొరీలు అవసరానికి మించి చేరుతాయి. ఇలా రాత్రిళ్లు అధికంగా చేరే పిండిపదార్థాలు, కొవ్వుల కారణంగా బరువు వేగంగా పెరుగుతారు.
బంగాళదుంపలు, పనీర్, కాలీఫ్లవర్‌తో చేసే పరాఠాల్లో కొందరు నెయ్యి లేదా నూనెను బాగా వేస్తుంటారు. వీటిని తరచూ రాత్రి భోజనంగా తినే వారిలో ఆరోగ్య సమస్యలు పక్కా.
కొందరు రాత్రిళ్లు వేపుళ్లను తింటుంటారు. పకోడీలు, సమోసాల వంటివి తెగ ఎంజాయ్ చేస్తారు. వీటిల్లో ట్రాన్స్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియలు నెమ్మదించేలా చేసి కొవ్వులు పేరుకునేలా చేస్తాయి.
కొందరు రాత్రిళ్లు ఫుల్ క్రీమ్ పాలు లేదా లస్సీ వంటివి తాగుతుంటారు., ఇందులో కూడా కొవ్వు, చక్కెరలు అధికంగా ఉంటాయి. ఈ పానీయాలను రాత్రిళ్లు తాగితే ఒంట్లో కొవ్వు ప్రమాదకర స్థాయిలో పేరుకోవడం పక్కా.
మార్కెట్‌లో దొరికే నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లో ఇంట్లో కూడా కొందరు వాటిని రెడీ చేసుకుంటారు. ఉప్పు, పండి, నూనెను ఇష్టారీతిన వాడి వీటిని తయారు చేసుకుని రాత్రిళ్లు భోజనంగా తింటారు. వీటి రాత్రి సమయాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఊబకాయం బారిన పడతారు. రాత్రి సమయాల్లో స్వీట్లు కూడా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలు మనసులో పెట్టుకుని రాత్రి భోజనం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని పదికాలాల పాటు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
ఉదయం పూట వాకింగ్ చేస్తున్నారా.. ఎవరికి ఏ సమయం తగినదంటే..
టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్