Budget 2025: ఆ పేషెంట్స్‌కు బిగ్ రిలీఫ్.. ప్రాణాలు కాపాడే మందులు చవకగా..
ABN, Publish Date - Feb 01 , 2025 | 01:43 PM
Budget 2025 For Healthcare Sector: ఆ పేషెంట్స్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రాణాలు కాపాడే 36 రకాల మందులపై ధరల్ని బాగా తగ్గించింది సర్కారు.

బడ్జెట్-2025లో కేంద్ర ప్రభుత్వం పలు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇచ్చింది. ట్యాక్స్ మినహాయింపులతో మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హెల్త్‌కేర్ సెక్టార్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చిన మోడీ సర్కారు.. ఆ పేషెంట్స్‌కు భారీ ఊరటను ఇచ్చింది. ప్రాణాలు కాపాడే 36 రకాల మందులను చవకగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ మెడిసిన్స్‌ను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
‘క్యాన్సర్‌తో పాటు అరుదైన వ్యాధులతో బాధపడే రోగులకు ఊరటను ఇవ్వడంలో భాగంగా ప్రాణాలు కాపాడే 36 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీని ఎత్తేస్తున్నాం. ఆ ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) నుంచి మినహాయిస్తున్నాం. ఆ లిస్ట్‌లో ప్రాణాలు కాపాడే మరో 6 రకాల మందులను చేరుస్తున్నాం. వీటిపై గతంలో 5 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు వాటిపై కస్టమ్స్ డ్యూటీ ఉండదు. పై అన్ని రకాల మందులను తయారు చేసే సంస్థలకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి’ అని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు
డెలివరీ సంస్థలో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ప్రపంచంలోనే తొలిసారి ఒకే స్తంభంపై ఐదు మెట్రోరైలు పట్టాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 01 , 2025 | 01:43 PM