Share News

6 ట్రేడింగ్‌ సెషన్లు.. రూ.31,000 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:32 AM

దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి మళ్లీ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గడచిన ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో అంటే ఈ నెల 21 నుంచి 28 వరకు ఎఫ్‌పీఐలు..

6 ట్రేడింగ్‌ సెషన్లు..  రూ.31,000 కోట్ల పెట్టుబడులు

ఈక్విటీ మార్కెట్లపై మళ్లీ ఎఫ్‌పీఐల నజర్‌

న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి మళ్లీ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గడచిన ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో అంటే ఈ నెల 21 నుంచి 28 వరకు ఎఫ్‌పీఐలు.. ఈక్విటీల్లో రూ.30,927 కోట్ల పెట్టుబడులు పెట్టారు. షేర్ల విలువలు ఆకర్షణీయంగా ఉండటం, రూపాయి విలువ పెరుగుతుండటం సహా ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు కనిపిస్తుండటమే ఇందుకు కారణం. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 6 శాతం వరకు రికవరీ సాధించటంతో పాటు మార్కెట్లపై మదుపరుల విశ్వాసం రోజురోజుకు పెరుగుతుండటం కూడా ఎఫ్‌పీఐలు మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారీగా పెరగటంతో మార్చి నెలలో వీరి ఉపసంహరణ కూడా స్వల్ప మొత్తంలో రూ.3,973 కోట్లుగా ఉన్నాయి.


ప్రతి 2 షేర్లకు ఒక షేరు

బోనస్‌ ఇష్యూ ప్రకటించిన బీఎ్‌సఈ

ముంబై: బీఎ్‌సఈ లిమిటెడ్‌.. ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోన్‌సగా జారీ చేయనున్నట్లు ప్రకటించింది. బోనస్‌ ఇష్యూలో భాగంగా వాటాదారులకు రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఒక షేరును జారీ చేయనుంది. బోనస్‌ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపిందని బీఎ్‌సఈ వెల్లడించింది. అయితే బోనస్‌ షేర్ల జారీకీ బీఎ్‌సఈ ఇంకా రికార్డు తేదీని ఖరారు చేయలేదు.

హల్దీరామ్‌లో టెమాసెక్‌కు వాటా

న్యూఢిల్లీ: సింగపూర్‌కి చెందిన పెట్టుబడుల సంస్థ టెమాసెక్‌కు వాటాల కేటాయింపుపై హల్దీరామ్‌ ఆదివారం ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం హల్దీరామ్‌ ప్రస్తుత వాటాదారుల నుంచి టెమాసెక్‌ వాటాలు కొనుగోలు చేస్తుంది. అయితే ఈ డీల్‌ వివరాలు మాత్రం హల్దీరామ్‌ వెల్లడించలేదు. అయితే రూ.85,000 కోట్ల విలువ గల హల్దీరామ్‌ కంపెనీలో 10% వాటాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నేడు మార్కెట్లకు సెలవు

సోమవారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ (రంజాన్‌) సందర్భంగా స్టాక్‌ మార్కెట్లు.. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు సెలవు. కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పనిచేయవు. మంగళవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి:

Financial Planning: ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..

Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:49 AM