Share News

Hyderabad: సిగరెట్‌ లేదన్నాడని.. ఎంతపని చేశాడో తెలిస్తే..

ABN , Publish Date - Apr 03 , 2025 | 07:07 AM

ఆయన ఎవరో తెలియదు.. వచ్చాడు.. ఓ సిగరెట్ ఇవ్వవా అన్నాడు. దీంతో మరో అతను నా దగ్గర సిగరెట్ లేదు అన్నాడు.. అంతే.. ఇక గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. సిగరెట్ లేదన్న వ్యక్తిపై దాడికి పాల్పడి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ సంఘటన చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయం వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సిగరెట్‌ లేదన్నాడని.. ఎంతపని చేశాడో తెలిస్తే..

- జలమండలి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై దాడి

హైదరాబాద్: సీతాఫల్‌మండి(Sitaphalmandi) జలమండలి సెక్షన్‌ కార్యాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సిగరెట్‌ లేదన్నాడని గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేశాడు. పోలీసులు, ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం... ఔట్‌సోర్సింగ్‌ లైన్‌మన్‌(Outsourcing Lineman)గా పనిచేస్తున్న జి.శ్రీనివాస్‌ బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయం వద్ద మంచినీటి సరఫరా చేసే వాల్‌ విప్పటానికి వెళ్లాడు.

ఈ వార్తను కూడా చదవండి: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు భారత వాయుసేన గ్రీన్‌ సిగ్నల్‌


మద్యం మత్తులో అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి శ్రీనివాస్‏ను సిగరెట్‌ను అడిగాడు. శ్రీనివాస్‌ లేదని చెప్పపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ వ్యక్తి శ్రీనివాస్(Srinivas)‏పై దాడి చేసి పరారయ్యాడు. స్వల్పగాయాలైన శ్రీనివాస్‌ వెంటనే చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‏పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్షుడు నారాయణ ప్రధాన కార్యదర్శి కిరణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌, పద్మారావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2025 | 07:13 AM