Share News

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Apr 03 , 2025 | 08:04 AM

క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‏లో చిక్కుకుని వందలాది పావురాలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ భవనంంలో జరిగింది. అయితే.. ఈ నెట్ ఏర్పాటు చేసిన ఏరియాలో భరించలేని దుర్వాసన వస్తో్ంది. ఇందుకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం.. విషయం ఏంటంటే..

- నెట్‌లో చిక్కుకుని పావురాలు మృత్యువాత

- కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్‌లో ఘటన

హైదరాబాద్: కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌(Katedan Sports Complex) భవనం చుట్టురా జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు ఏర్పాటు చేసిన నెట్‌(వల)లో చిక్కుకున్న వందలాది పావురాలు వారం రోజులుగా మృత్యువాత పడ్డాయి. పావురాల కలేభరాల నుంచి వస్తున్న దుర్వాసన భరించలేక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు మార్నింగ్‌ వాక్‌కు, యోగ, స్కేటింగ్‌ చేయడానికి ఎవరూ రావడం లేదు.

ఈ వార్తను కూడా చదవండి: WhatsApp: వాట్సాప్‏లో సట్టా బెట్టింగ్‌


జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ క్రేన్‌ను తీసుకువచ్చి చనిపోయిన పావురాలను నెట్‌ల నుంచి తొలగించి వాటిని సమాధి చేయాలని వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరుతున్నారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


శుభ్రతపై నేడు నిర్ణయం: స్పోర్ట్స్‌ అధికారి ఇక్బాల్‌

కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో పావురాలు మరణించిన విషయం తన దృష్టికి రావడంతో బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించానని స్పోర్ట్స్‌ అధికారి ఇక్బాల్‌ తెలిపారు. నెట్‌ 25 ఫీట్ల ఎత్తులో ఉంది. గురువారం గ్రేటర్‌ దక్షిణ మండలం జోనల్‌ కమిషనర్‌కు చెప్పి పావురాలను ఎలా శుభ్రం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2025 | 08:04 AM