Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి నుంచే రూ.20 వేల ఆదాయం..
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:53 PM
Business Idea For Women:తాము ఏదొక పని చేసి కుటుంబ అవసరాలకు సరిపడా సంపాదించాలనే కోరిక దాదాపు అందరు మహిళలకీ ఉంటుంది. మీకు అలాంటి ఆలోచనే ఉందా..ఇంటి దగ్గరే ఉండి తీరిక సమయంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం కోసం వెతుకుంటే.. ఇది మీకోసమే. ఈ వ్యాపారానికి పెట్టుబడి.. పని రెండూ తక్కువే. కానీ, ఆదాయం మాత్రం ఘనంగా వస్తుంది. అదేంటో చూద్దాం..

Business Idea For Women: సాధారణంగా మహిళలకు ఇంట్లో పనితోనే రోజంతా గడిచిపోతుంది. స్వంత ఖర్చులకైనా సంపాదించుకోవాలనే కోరిక ఉన్నా తీరిక లేని పని కారణంగా రోజులో రెండు మూడు గంటల కంటే ఎక్కువ సమయం మిగలదు. అందుకే జాబ్ చేయాలనే ఆశను మనసులోనే అణిచివేసుకుంటారు. ఇంట్లో పనులకు ఆటంకం కలగకుండానే సొంతంగా ఆదాయం పొందాలనే ఆలోచన మీకొకటి చెప్తాం. ఇందుకోసం మీరు రోజులో కనీసం రెండు గంటలు కేటాయిస్తే చాలు. ప్రతి నెలా ఏ ఉద్యోగికి తీసిపోని విధంగా లాభాలొస్తాయి. ఇప్పుడా వ్యాపారం ఏంటో తెలుసుకుందాం.
రోజులో రెండు గంటలు కేటాయిస్తే చాలు.. నెలకు మినిమం రూ.20వేలు..
పని త్వరగా పూర్తవ్వాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఇక వంట త్వరగా రుచిగా రావాలంటే కాసింత గరం మసాలా యాడ్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు ఇంట్లో మహిళలే కాదు. హోటళ్లు, రెస్టరెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇలా ప్రతి చోటా వంటకాలు రుచిగా ఉండేందుకు మసాలాలు కచ్చితంగా వేస్తారు. ఇంట్లో అయితే ఎలాగోలా సొంతంగా అప్పటికప్పుడు చేసుకోగలరు కానీ.. ఇలా పెద్ద మొత్తంలో వండేటప్పుడు ఇన్‌స్టంట్ మసాలాలే దిక్కు. అందుకే ప్రస్తుతం వీటికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. అందుకే చాలా మంది మహిళలు స్థానికంగా ఉండే హోటళ్లతో మాట్లాడుకుని సప్లై చేస్తూ నెలకు కనీసం రూ.20వేల నుంచి రూ.50 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఇందుకోసం కేవలం రోజులో రెండు గంటల సమయం కేటాయిస్తే చాలు. దీన్నే పూర్తి స్థాయి వ్యాపారంగా చేస్తే నెల నెలా లక్షల్లో లాభాలు వస్తాయి.
ఎలా మొదలుపెట్టాలి..
నిజానికి ఈ గరం మసాలాల తయారీ చాలా సులభం. ఇందుకు అవసరమయ్యే సుగంధ ద్రవ్యాలు అన్ని మార్కెట్లో విడిగా తక్కువ ధరకే దొరుకుతాయి లేదా హోల్ సేల్ మార్కెట్లో కొనుక్కోండి. కమర్షియల్ గ్రైండర్ ద్వారా ఈ సుగంధ ద్రవ్యాల్ని గ్రైండ్ చేయండి. మీకున్న ఖాళీ సమయంలో వీటిని తయారుచేసి ప్యాకింగ్ చేసి పెట్టుకోవచ్చు. అవసరమైతే సెమీ ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్లు కొనుక్కోండి. సమయం ఆదా అవుతుంది. అయితే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. మసాలాను రుచిగా, శుచిగా తయారు చేయండి. ప్రారంభంలో స్థానిక హోటళ్లు, దాబాలతో డీలింగ్ కుదుర్చుకుని మీపై నమ్మకాన్ని కలిగించండి. ఒక్కసారి ఊపందుకుంటే వినియోగదారులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.
Read Also : BSNL హోలీ గిఫ్ట్.. 365 రోజుల ఫ్రీ కాల్స్.. ఫ్రీ డేటా కూడా.. ధర ఎంతంటే?
60 ఏళ్లలో తన ఫిట్‌నెస్ రహస్యాలను తెలిపిన నీతా అంబానీ..
Crypto Market: క్రిప్టో మార్కెట్‌పై భారత మహిళల ఆసక్తి.. ఏడాదిలో 20 శాతం పెరిగిన మహిళా ఇన్వెస్టర్లు..