Post Office: పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడి..పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు, ఎలాగంటే..
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:25 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో అనేక మందికి పోస్టాఫీస్ స్కీంల గురించి అవగాహన ఉండదు. కానీ వీటిలో కూడా బ్యాంకుల కంటే మంచి వడ్డీ రేట్లు లభిస్తుండటం విశేషం. ఈ క్రమంలో వీటిలోని ఓ స్కీంలో మీరు పెట్టుబడులు చేస్తే అవి డబుల్ అవుతాయి. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.

ప్రస్తుత కాలంలో అనేక మంది కూడా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ సేవింగ్స్ అంటూ పెట్టుబడులు చేస్తున్నారు. కానీ సీనియర్ సిటిజన్లతో పాటు అనేక మంది కూడా పోస్టాఫీస్ స్కీం పెట్టుబడులు బెస్ట్ అని చెబుతున్నారు. అంతేకాదు ఇవి మీకు ఎలాంటి రిస్క్ లేకుండా రాబడులను అందిస్తాయని అంటున్నారు. ఇవి ఇప్పటికే నిరూపించాయన్నారు. ఈ క్రమంలో పోస్టాఫీస్ డిపాజిట్ స్కీం(TD - Term Deposit) ద్వారా మీ పెట్టుబడులను డబుల్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడి డబుల్
పెట్టుబడులు చేసే ముందు మనం ఎంచుకునే పథకాలు, వాటి వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపు లాభాల వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ TD పథకం ద్వారా స్థిరమైన వడ్డీతోపాటు నమ్మకమైన రాబడులను అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీంలో డిపాజిట్ వడ్డీ రేటు 7.5% లభిస్తుంది. ఈ పథకం మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే మీరు 10 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే దీనిలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు 10 సంవత్సరాల పాటు రూ. 5 లక్షలను పోస్ట్ ఆఫీస్ TD పథకంలో పెట్టుబడి చేస్తే, 7.5% వడ్డీ రేటుతో, 10 సంవత్సరాల తరువాత మీకు రూ.10,51,175 పొందవచ్చు. ఇది, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం (5 లక్షలు) కంటే రెట్టింపు అయ్యింది. అయితే దీనిలో వడ్డీని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఈ కారణంగా మీరు మరింత లాభాన్ని పొందే ఛాన్సుంది.
పోస్టాఫీస్ TD పథకం ప్రయోజనాలు
పోస్టాఫీస్ TD పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. దీంతోపాటు దీని ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అంతేకాదు దీనిలోని 7.5% వడ్డీ రేటు ఇతర బ్యాంకు FDలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం విశేషం. బ్యాంకుల FDలలో సాధారణంగా 6-7% మాత్రమే ఉంటుంది. ఈ పెరిగిన వడ్డీ రేటు, మీకు పెద్ద మొత్తంలో రాబడులను అందించడానికి సహాయపడుతుంది.
పెట్టుబడి ప్రారంభం చాలా సులభం
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. మీరు కనీసం 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఈ పథకాన్ని మీరు 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఇకపై, మీరు రూ. 1 లక్ష, 5 లక్షలు లేదా మరిన్ని మొత్తాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. దీంతోపాటు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ మినహాయింపుతో మీరు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు
పోస్టాఫీస్ TD పథకంలో పెట్టుబడిని ప్రారంభించేటప్పుడు, కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పక తెలుసుకోవాలి. ఈ పథకంలో 6 నెలల ముందు డబ్బును మీరు ఉపసంహరించుకోలేరు. అయితే, 6 నెలలు పూర్తయిన తర్వాత డబ్బును ఉపసంహరించుకుంటే, పొదుపు ఖాతా ప్రకారం వడ్డీ అందుతుంది. ఈ కారణంగా, ఈ పథకంలో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు మీ డబ్బును ఒక నిర్దిష్ట కాలం పాటు తీసుకోకుండా ఉంచడానికి సిద్దంగా ఉండాలి. మీరు ముందుగా నిర్ణయించిన కాలవ్యవధిని పూర్తి చేసిన తర్వాత, మీరు ఈ ఖాతాను పొడిగించురకోవచ్చు. ఇది మీకు మరింత లాభాలను తెచ్చిపెట్టే అవకాశాన్ని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News