Share News

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:56 PM

ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శాంసంగ్ ఇండియా తమ బెస్పోక్ AI విండ్‌ఫ్రీ ఎయిర్ కండిషనర్‌లో ఒక వినూత్నమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..
Samsung acs New Technology

టెక్ ప్రపంచంలో శాంసంగ్ గట్టి పోటీ ఇస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శాంసంగ్ ఇండియా బెస్పోక్ AI విండ్‌ఫ్రీ ఎయిర్ కండిషనర్‌లో ఒక వినూత్నమైన ఫీచర్‌ను ప్రారంభించింది. దీని పేరు "కస్టమైజ్డ్ కూలింగ్". ఇది కూలింగ్ విధానాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి, నిద్రను మరింత సులభతరం చేసి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. ఈ కొత్త ఫీచర్ SmartThings (స్మార్ట్ వాచ్ లాంటివి) ద్వారా పనిచేస్తుంది. దీంతోపాటు మాన్యువల్ సర్దుబాట్ల అవసరాన్ని కూడా తగ్గించి, స్థిరమైన ఉష్ణోగ్రతను అందిస్తుంది.


ఏంటి ఈ కస్టమైజ్డ్ కూలింగ్ ఫీచర్?

ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ACలు, ఫ్యాన్లను కలిపి ఉపయోగిస్తారు. దీనివల్ల మాన్యువల్ సర్దుబాట్లు చేయడం అవసరం పడుతుంది. అది నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తుంది. దీంతోపాటు విద్యుత్ వినియోగాన్ని కూడా పెంచుతుంది. అంతేకాదు 50% మంది భారతీయ వినియోగదారులు రాత్రంతా తమ ACలను ఆన్, ఆఫ్ చేస్తూ నిద్రపోతుంటారు. ఇది కొన్నిసార్లు నిద్రకు ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో ఈ ఫీచర్ ద్వారా సరైన ఉష్ణోగ్రతను కస్టమర్లకు అందించి సౌకర్యవంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.


ఇది ఎలా పని చేస్తుంది?

ఈ కస్టమైజ్డ్ కూలింగ్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ హోమ్‌లోని ఫ్యాన్లు, స్విచ్‌లు, ACలను ఒకే సమయంలో సమన్వయం చేసుకోవచ్చు. SmartThings ఆధారిత సాంకేతికతతో, ఏపీఐ, WWST-సర్టిఫైడ్ డివైస్లతో కనెక్ట్ చేసి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి వినియోగదారులకు తమ గృహంలో ఎలాంటి మాన్యువల్ మార్పుల అవసరం లేకుండా స్థిరమైన ఉష్ణోగ్రతను అందించడంలో సహాయపడతాయి.


విద్యుత్ పొదుపు

ఈ ఫీచర్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. SmartThings ఎనర్జీ సర్వీస్ ద్వారా, వినియోగదారులు తమ విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించి, ఇష్టానుసారం మార్చుకోవచ్చు. దీంతో విద్యుత్ బిల్లులలో సంపూర్ణ తగ్గుదల సాధ్యమవుతుంది. ఈ సరికొత్త AI ఆధారిత కస్టమైజ్డ్ కూలింగ్ ఫీచర్ Samsung 2025 బెస్పోక్ AI విండ్‌ఫ్రీ AC‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఏసీలు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనే విషయాలను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.


ఇవి కూడా చదవండి:

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:57 PM