Trump Trade Talks: డెడ్ లైన్ సమీపిస్తున్న వేళ ట్రంప్ ఆరాటం
ABN , Publish Date - Apr 05 , 2025 | 09:44 AM
ప్రపంచ దేశాలపై ట్రంప్ కొత్తగా తెచ్చిన టారిఫ్స్ అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటల నుంచి 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ అమల్లోకి వస్తుంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన కొత్త టారిఫ్స్ అమలుకు గడువు(ఏప్రిల్ 5) సమీపిస్తున్న తరుణంలో పరిణామాలు చకచకా కదులుతున్నాయి. ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాల నిర్ణయం ఆదేశానికే ముప్పుగా పరిణమించింది. దీంతో మొత్తం యూఎస్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి.కొవిడ్ తర్వాత ఎన్నడూ లేనంత ఫాల్ ను ఎదుర్కొంటున్నాయి. మరో పక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క భారీ సుంకాలకు మార్కెట్లు, విదేశీ ప్రభుత్వాలు, US కంపెనీలు, ఫెడరల్ రిజర్వ్ చీఫ్, ఇంకా కీలక అమెరికా చట్టసభ సభ్యుల నుండి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది.
దీంతో ట్రంప్ సర్కారు కూడా త్వరత్వరగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రారంభించిన చర్చల్ని ముగింపు దశకు తెస్తోంది. ఇందులో భాగంగా భారతదేశం, ఇజ్రాయెల్, వియత్నాంతో వాణిజ్య చర్చల్లో రాజీకి వస్తే బెటర్ అని అమెరికా ఆలోచిస్తోన్నట్టు తెలుస్తోంది. మరోవైపు,వియాత్నాం కూడా పాజిటివ్ దృక్పదంతో ముందుకు సాగుతోంది. రెండు వైపులా పరస్పర ఒప్పందం కుదుర్చుకోగలిగితే.. సుంకాలను సున్నాకి తగ్గించాలని వియత్నాం చూస్తోంది. ఈ మేరకు ఆదేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి టో లామ్ ప్రతిపాదించారని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
ట్రంప్ సీనియర్ సలహాదారుడిని ఉటంకిస్తూ అక్కడి ఒక వార్తా సంస్థ తన నివేదికలో వెల్లడించిన దాని ప్రకారం వియత్నాం, భారతదేశం, ఇజ్రాయెల్ వంటి దేశాలు వాణిజ్య చర్చలను వేగవంతం చేయాలని చూస్తున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా సుంకాల గడువు ముగిసేలోపు వ్యక్తిగత ఒప్పందాలను ఖరారు చేసే ప్రయత్నాలలో పాల్గొంటున్నారని పేర్కొంది. ఈ చర్చలు విజయవంతమైతే, ప్రతిపాదిత సుంకాలను విధించకుండా ఉండటానికి ట్రంప్‌కు సాధ్యమైన మార్గాన్ని అందించవచ్చని నివేదిక జోడించింది.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News