Online Rummy: ఆన్‌లైన్ రమ్మీ.. మరోకరి ప్రాణాలు తీసింది
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:22 PM
ఆన్‌లైన్ రమ్మీ.. మరోకరి ప్రాణాలు తీసింది. మొత్తం రూ. 10 లక్షల పోవడంతో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యావంతుడు.. పైగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగే ఈ క్రీడకు బలైపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- రూ.10 లక్షల నష్టం
- రైలు కింద పడి బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య
చెన్నై: ఆన్‌లైన్ క్రీడల్లో భారీగా నగదు కోల్పోయిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్(Bank Assistant Manager) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుచ్చి జిల్లా బిడార మంగళం ప్రాంతానికి చెందిన జయకుమార్ (37) ఈరోడ్ జిల్లా ముత్తూరులో కరూర్ వైశ్యా బ్యాంక్(Karur Vysya Bank)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు
కొద్ది నెలలుగా ఆన్‌లైన్ రమ్మీకి ఆడుతున్న జయకుమార్, సుమారు రూ.10 లక్షలకు పైగా డబ్బు పోగొట్టుకున్నట్లు సమాచారం. అలాగే, రూ.2 లక్షలు కావాలని భార్య కవితను ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో, నామక్కల్ జిల్లా నెయికారన్‌పట్టిలోని బంధువుల ఇంటికి సోమవారం వచ్చిన జయకుమార్, అక్కడ ఆత్మహత్యకు యత్నించగా బంధువులు అడ్డుకున్నట్లు తెలిసింది.
దీంతో, మంగళవారం సాయంత్రం తన బైక్‌పై నెయికారన్‌పట్టి సమీపంలోని రైలుపట్టాల వద్దకు వచ్చి బైక్ పార్కింగ్ చేసి, ఆ సమయంలో అటు వైపు వచ్చిన సేలం-మైలాడుదురై ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సేలం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News