Heroin: హెరాయిన్‌తో ప్రేమజంట అరెస్ట్...
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:46 PM
ఓ ప్రేమజంట హెరాయిన్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు వారిని అరెస్టు చేసి వీరికి హెరాయిన్ ఎవరు సరఫరా చేస్తున్నారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్(Chennai Central Railway Station) సమీపంలో హెరాయిన్(Heroin) విక్రయిస్తున్న ఓ ప్రేమజంటను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్రిపుర(Tripura) రాష్ట్రానికి చెందిన షాహుల్ హుస్సేన్ (23), 17ఏళ్ళ యువతిని ప్రేమించి రెండేళ్ళుగా పెరంబూరులో ఓ ప్రైవేటు సంస్థలో కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: సీఎం స్టాలిన్ ఆగ్రహం.. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా..
ఈ నేపథ్యంలో వాల్టాక్స్ రోడ్డు(Waltox Road)లోవున్న ఓ హోటల్‌లో గత వారంరోజులుగా బసచేసిన వీరు, దేశంలో నిషేధించిన మాదకద్రవ్యాలను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళవారం ఉదయం పోలీసులు ఆ హోటల్‌కు వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. ప్రేమజంటను అదుపులోకి తీసుకుని వారినుండి 130గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లంచాలు మరిగి.. వలకు దొరికి.. !
అమెరికాలోనే పేపాల్ డాటా లీకేజీ!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు
Read Latest Telangana News and National News